Site icon Prime9

Peddi First Shot: 52 సెకండ్ల బ్లాస్ట్.. చరణ్ లుక్ నెక్స్ట్ లెవెల్

peddi first shot out

peddi first shot out

Peddi First Shot:ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ కు శ్రీరామనవమి కానుకగా పెద్ది ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసి పండుగ శుభాకాంక్షలు చెప్పుకొచ్చారు మేకర్స్. గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 

ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా పెద్ది ఫస్ట్ షాట్ నెక్స్ట్ లెవెల్ లో కనిపిస్తుంది. రా అండ్ రస్టిక్ లుక్ లో చరణ్ అదరగొట్టేశాడు. 54 సెకండ్లు ఉన్న ఈ షాట్ హై ఇంపాక్ట్ ను ఇచ్చింది.  అభిమానులు చరణ్ ను ఎలా అయితే చూడాలనుకున్నారో అలానే బుచ్చి దించేశాడు.

 

ఒక పక్క సిద్ధాంతాన్ని, ఇంకోపక్క ఐడియాలజీని ఆ క్యారెక్టర్ లో చూపించి మరింత హైప్ పెంచాడు బుచ్చి. పెద్ది పెద్ది అని జనాలు అరుస్తుండగా.. రామ్ చరణ్ గ్రౌండ్ లో అడుగుపెడుతూ ఇచ్చిన ఎంట్రీ.. ఒకటే పని చేయడానికి.. ఒకేలాగా బతికేయడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకు. ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే చేశాయాలా.. పుడతామా ఏంటి మళ్లీ .. చెప్మే” అంటూ ఒకే ఒక్క డైలాగ్ తో చరణ్ గూస్ బంప్స్ తెప్పించాడు. ఇక సినిమాకు పెద్ద హైలైట్ అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనే చెప్పాలి.

 

పెద్ది పెద్ది అంటూ ఎలివేషన్ ఇచ్చిన ప్రతిసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పిచ్చెక్కించాడు. ఇక చరణ్ లుక్.. క్రికెట్ గ్రౌండ్ లో అతని యాటిట్యూడ్.. వేరే లెవెల్.  ఓవరాల్ గా పెద్ది ఫస్ట్ షాట్.. సినిమాపై అంచనాలను పెంచేసిందనే చెప్పాలి. ఇక ఈ షాట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్. ప్రకటించారు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పెద్ది రాబోతున్నాడు. మార్చి 27 న ఈ సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ షాట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Peddi First Shot - Release Date Glimpse ( Telugu ) | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu Sana

Exit mobile version
Skip to toolbar