Site icon Prime9

Ram Charan: రీరిలీజ్‌కి రెడీ అయిన రామ్‌ చరణ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ – ఈ లవర్స్‌ డేకి థియేటర్‌లో సందడి, ఇంతక అదే సినిమాంటే!

Orange Movie Re Release: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్‌ ఛేంజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం అందుకుంది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అనుకున్న ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ అందుకుంది. ఫైనల్‌ గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చరణ్‌ RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అయితే చరణ్‌ తన కెరీర్‌లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలను అందించారు. ముఖ్యంగా ఆయన నటించి ప్రేమకథ చిత్రాల్లో ‘అరెంజ్‌’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకటి. రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా, భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2010 నవంబర్‌ 26న విడుదలైంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మొదట ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కల్ట్‌ క్లాసికల్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. హారిస్ జైరాజ్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. ఆరెంజ్‌లోని చిలిపిగా చూస్తావెల.. రుబా రుబా పాటలు ఇప్పటికీ యూత్ ఫెవరేట్‌గా నిలిచాయి.

ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేమని, మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదు.. కాబట్టి ప్రేమించుకున్నన్ని రోజులు ప్రేమించుకుందాం అనే సరికొత్త కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించాడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌. ఈ సినిమా రిలీజై 14 ఏళ్లు దాటిన ప్రేమకు కొత్త అర్థం తీసుకువచ్చిన ఆరెంజ్‌ మూవీ మెగా ఫ్యాన్స్‌కి ఇప్పటికీ ప్రత్యేకమే అని చెప్పాలి. థియేటర్‌లో ప్లాప్‌గా నిలిచిన ఈ చిత్రం యూత్‌ని మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లోకి తీసుకువస్తున్నారు. 2023లో రీ రిలీజైన ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది.

రెండు రోజులు పాటు థియేటర్లో అలరించిన ఈ చిత్రం కలెక్షన్స్‌ కూడా బాగానే రాబట్టింది. ప్రేమికుల్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఆరెంజ్‌ని ఈ వాలంటైన్స్‌ డే సందర్భంగా రీరిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ రెడీ అయ్యారు. ఫిబ్రవరి 14న ఆరెంజ్‌ని రీ రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది. దీంతో ఈ మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ప్రేమకు కొత్త అర్థంగా నిలిచిన ఆరెంజ్‌ని లవర్స్‌ డే సందర్భంగా థియేటర్లోకి తీసుకువస్తుండటంతో ఈ సారి ప్రేమికుల రోజు మరింత స్పెషల్‌గా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version