Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొనేందుకు మరియు ప్రమోషన్స్ కోసం ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక యూఎస్ లో దిగిన చరణ్ వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యధికమంది వీక్షించే గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో అమెరికన్ నెంబర్ వన్ న్యూస్ స్ట్రీమింగ్ ఛానల్ ఏబీసీ (ABC) న్యూస్ కి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చరణ్ చెప్పుకొచ్చారు.
అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా – రామ్ చరణ్ (Ram Charan)
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇండియన్ సినిమాల్లో నటిచాలి అనుకుంటున్నారా? లేదా హాలీవుడ్ సినిమాల్లో నటించాలి అనుకుంటున్నారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు చరణ్ బదులిస్తూ.. ‘ప్రస్తుతం నేను ఇండియాలో కొన్ని ప్రాజెక్ట్స్ కి సైన్ చేశాను. అలాగే అవుట్ సైడ్ ఇండియా కూడా ప్రాజెక్ట్ లు కూడా చేయాలనీ అనుకుంటున్నా. ఇక్కడి డైరెక్టర్ లతో కూడా వర్క్ ఎక్స్‌పిరెన్స్ చేయాలని ఉంది. ఒకవేళ అవకాశం వస్తే కచ్చితంగా ఇక్కడ కూడా సినిమాలు చేస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ఆ యాంకర్ ‘హాలీవుడ్ సినిమాల్లో మీకు అవకాశం వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు’ అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
#RRR star @AlwaysRamCharan sits down with @ReeveWill to discuss the popularity of the Tollywood film and the viral Oscar-nominated song, “Naatu Naatu.”
#RRRMovie @RRRMovie pic.twitter.com/0dJeoS6v86
— ABC News Live (@ABCNewsLive) February 24, 2023
కాగా నేడు (ఫిబ్రవరి 24) బెవర్లీ హిల్స్ లో జరగబోయే HAC (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్) అవార్డ్స్ కి రామ్ చరణ్ ప్రజెంటర్ గా హాజరు కాబోతున్నాడు. ఈ ఈవెంట్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా చరణ్ కావడం గమనార్హం. అలానే ఆర్ఆర్ఆర్’ కోసం తాము ఎంతో కష్టపడ్డామని చరణ్ చెప్పారు. నాటునాటు పాటను ఉక్రెయిన్ లోని అందమైన లొకేషన్లలో తీశామని… షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఒక టూరిస్ట్ గా మళ్లీ ఉక్రెయిన్ కు వెళ్లాలని అనుకున్నానని తెలిపారు. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వస్తే ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడతానని చెప్పారు. ఆస్కార్ అవార్డుల స్థాయికి భారతీయ సినిమాలు వస్తుండటం సంతోషకరమని అన్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం “ఆర్ఆర్ఆర్”. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మూవీలో.. ఆలియా భట్, ఒలీవియో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్య పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు వేదికల మీద తన సత్తా చాటుకుంది ఆర్ఆర్ఆర్. ఎన్నో అవార్డ్ లను కైవసం చేసుకుంది, ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్. ఇక ఆస్కార్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/