Site icon Prime9

Sunishit : సునిశిత్ కి డబ్బులిచిన చరణ్ ఫ్యాన్స్.. ఇంకెప్పుడు అలా చేయొద్దంటూ.. కారణం ఏంటంటే !

ram charan fans giving money to sunishit and video goes viral

ram charan fans giving money to sunishit and video goes viral

Sunishit : ఇటీవల కాలంలో ఎవరు బడితే వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేయడం.. సోషల్ మీడియా లో ఏదో ఒక విధంగా కాస్త పేరు తెచ్చుకున్న వారిని ఇంటర్వ్యూ లు చేయడం ఒక పరిపాటిగా మారింది. మరి ముఖ్యంగా ఫేమస్ కోసం అవ్వడం ఏది పడితే అది చేసెయ్యడం.. లాంటివి చేసే ఒక బ్యాచ్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్వ్యూ లు చేసెయ్యడం అలవాటు అయిపోయింది. వాళ్ళే పనికిమాలిన వాళ్ళు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ లు చేసే ఈ యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి పదే. ఒక పనికిమాలిన వ్యక్తికి మరో పనికిమాలిన యూట్యూబ్ ఛానల్ అన్నట్లుగా సాగుతుంది ఈ వ్యవహారం. మీడియా వాల్యూస్ ని .. జర్నలిజం కి ఉన్న పేరుని పోగొట్టేది ఇలాంటి వారే అని కొందరి అభిప్రాయం.

ఏదో ఒక విధంగా ఫేమ్ తెచ్చుకోవాలని పిచ్చి పనులు అన్నీ చేయడం.. అలా అయిన వాళ్ళని కొన్ని పనికిమాలిన ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ లు చేసెయ్యడం. వాళ్ళు అలా చేయడం వాళ్ళని వెంటనే కొందరు మీమర్స్ సోషల్ మీడియాలో ఆ పిచ్చి బ్యాచ్ కి హైప్ ఇవ్వడం.. చివరగా వాళ్ళని ఒకప్పుడు ప్రేక్షకాదరణ పొందిన కొన్ని ప్రోగ్రామ్స్ కి తీసుకు రావడం ఈ తంతు గత కొంతకాలంగా నడుస్తుంది. ఈ కోవలోనే సోషల్ మీడియా, యూట్యూబ్ ఎక్కువగా చూసే వారికి “సునిశిత్” గురించి కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది.

నోటికి ఏది వస్తే అది వాగడం.. అడ్డు అదుపు లేకుండా తోచింది చెప్పేయ్యడం.. అవి అబద్ధాలు అని తెలిసి కూడా కొన్ని పనికిమాలిన యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం, ఫేమ్ కోసం సునిశిత్ ని ఇంటర్వ్యూ లు చేసి చివరికి “శాక్రిఫైజింగ్ స్టార్” అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. అయితే రీసెంట్ గా ఈ వ్యక్తిపై మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల‌కు సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో సునిశిత్ అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దీంతో చ‌ర‌ణ్ అభిమానుల‌కు కోపం వ‌చ్చి.. సునిశిత్‌ను ప‌ట్టుకుని నెక్స్ట్ లెవెల్ లో ఉతికి ఆరేశారు. సునిశిత్‌ను కొట్టిన వీడియో నెట్టింట వైర‌ల్ కూడా అయ్యింది.

కానీ తాజాగా ఇప్పుడు మరో విషయం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. సునిశిత్‌ను కొట్టిన రామ్ చ‌ర‌ణ్ అభిమానులు త‌ర్వాత కొంత డ‌బ్బులు ఇచ్చారని తెలుస్తుంది. అదే విధంగా ‘‘అలా మాట్లాడటం తప్పు.. లేడీస్ గురించి అలా మాట్లాడొద్దు. ఖర్చులకు ఈ డ‌బ్బులు ఉంచుకో. నీకు దెబ్బలు ప‌డ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటో నీకు తెలుసు. అలా చేయ‌టం త‌ప్పు.. ఇంట్లో ఆడ‌వాళ్ల గురించి మాట్లాడ‌టం త‌ప్పు. మొన్న‌టి వ‌ర‌కు సినిమా గురించి మాట్లాడావు. కానీ నిన్ను ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ ఇప్పుడెందుకు ప‌డ్డాయి.. అది త‌ప్పు. ఇక‌పై రామ్ చ‌ర‌ణ్‌గారు, ఉపాస‌న గారే కాదు.. అస‌లు ఏ హీరో గురించి అయినా త‌ప్పుగా మాట్లాడొద్దు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి ఇలా మాట్లాడితే ఎవ‌రైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. హ్యాపీగా ఉండు.. హ్యాపీగా బ‌తుకు.. ప‌ర్స‌న‌ల్ విష‌యాల జోలికి వెళ్ల‌మాకు’’ అంటూ డ‌బ్బుల‌తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చేశారు. చ‌ర‌ణ్ అభిమానులు మాట్లాడిన మాట‌ల‌కు సునిశిత్ కూడా స‌రేనంటూ తల ఊపడం ఆ వీడియోలో గమనించవచ్చు.

గతంలో కూడా లావణ్య త్రిపాఠితో నాకు పెళ్తైంది అని ప్ర‌చారం చేసుకున్నాడు సునిశిత్. లావణ్య పోలీసుల‌కు కంప్లైంట్ ఇవ్వడంతో  అతను జైలుకు కూడా వెళ్ళాడు కానీ ఇంకా బుద్ధి మారలేదు. బాహుబలి సినిమా నాతో చేయాల్సింది.. బాహుబలి హీరో ముందు నేనే.. ట్రిపులార్ సినిమా ఛాన్స్ నాకే.. అసలు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు నాతో పోల్చుకుంటే హీరోలే కాదు.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అస‌లు దర్శకుడే కాదు.. ఇలాంటి కామెంట్స్‌తో యూట్యూబ్‌లో హల్ చల్ చేశాడు. ఇప్పటికైనా తీరు మార్చుకుంటే మంచిది అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

 

Exit mobile version