Site icon Prime9

RC16 First Look and Title: రామ్‌ చరణ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ – RC16 నుంచి ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ వచ్చేసింది

Ram Charan RC16 First Look and Title Release: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది ఆర్‌సీ16(RC16) టీం. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్‌ చేశారు. ఇందులో చరణ్‌ ఊరమాస్‌ అవతార్‌లో పవర్ఫుల్‌ లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ ఫస్ట్‌లుక్‌లో ఫ్యాన్స్‌ అంతా ఫిదా అవుతున్నారు. బొమ్మ బ్లాక్‌బస్టర్‌ అంటూ మెగా అభిమానులంతా మురిపోతున్నారు. కాగా మార్చి 27న రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా RC16 టీం ఈ సినిమా నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌ రాబోతుందని ముందే ప్రకటించింది.

చెప్పినట్టుగానే గురువారం ఉదయం 9 గంటలకు చరణ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని ప్రకటించారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్‌ చేసింది. ముందు నుంచి వినిపిస్తున్న టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని ఖరారు చేసి వెల్లడించారు.  ‘ఏ మ్యాన్‌ ఆఫ్‌ ది ల్యాండ్‌, ఏ మ్యాన్‌ ఆఫ్‌ ది నేచర్‌’ అంటూ చరణ్‌ పాత్రని పరిచయం చేశారు. ఇందులో రామ్‌ చరణ్‌ గుబురు గడ్డం, హెయిర్‌ స్టైల్‌, ముక్కుకు రింగ్‌తో బీడీ కాలుస్తూ ఊరమాస్‌ అవతార్‌లో కనిపించాడు.

బ్యాగ్రౌండ్‌ మ్యాచ్‌ జరుగుతున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ ఫస్ట్‌లుక్‌కి ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. మల్టీ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతి బాబు, బాలీవుడ్‌ నటుడు దివ్వేందులు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar