Rakul Preet Singh: నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ప్రియుడు జాకీ భగ్నానీ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిద్దరు రెండేళ్ల కిందటే తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలసిందే. అప్పటి నుంచి ఈ జంట పార్టీలు, ఈవెంట్లలో కలిసి కనిపిస్తున్నారు.
ఇండియన్ 2లో..(Rakul Preet Singh)
రకుల్ సన్నిహత వర్గాల సమాచారం మేరకు ఫిబ్రవరి 22న గోవాలో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరుగనుంది.ప్రస్తుతం ఈ జంట బ్యాంకాక్‌లో హాలిడేలో ఉన్నారు.త్వరలోనే వీరు అధికారికంగా తమ పెళ్లి తేదీని ప్రకటించే అవకాశముంది. రకుల్ తెలుగులో అగ్రనటులతో నటించింది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ధృవ, సరైనోడు చిత్రాలతో విజయాలను అందుకుంది. త్వరలో కమల్ హాసన్ మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇండియన్ 2లో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా మరియు ప్రియా భవానీ శంకర్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.