Rajinikanth in Abudhabi: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అబుదబిలోని బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించారు. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా లభించిన వెంటనే ఆయన బాప్స్ హిందూ దేవాలయాన్ని సందర్శించినట్లు తన ఎక్స్ ఖాతాలో వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేశారు. బాప్స్ హిందూ మందిర్ కూడా రజనీకాంత్ వీడియోలను విడుదల చేసింది. కాగా సూపర్ స్టార్ దేవాలయం పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. బదులుగా పూజారి రజనీకాంత్ చేతికి పవిత్రదారంతో పాటు పుస్తకాలు బహుమతిగా ఇచ్చారు. కాగా రజనీ దేవాలయం మొత్తం కలియ తిరిగి దేవాలయం ఆర్కిటెక్‌ను శ్రద్ధగా గమనించారు. దేవాలయం ముందు నిలుచొని ఆయన ఫోటోలకు ఫోజు ఇచ్చారు.
రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా..(Rajinikanth in Abudhabi)
ఇదిలా ఉండగా అబుదభీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్… డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ అంట్ టూరిజం రజనీకాంత్‌కు గోల్డెన్ వీసా ఆమోదించింది. గురువారం నాడు వీసా లభించిన వెంటనే ఆయన చెన్నైలో సినిమా షూటింగ్ ముగించుకుని అబుదబిలో బాప్స్ దేవాలయం సందర్శించడానికి బయలు దేరారు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు ఆయన మహ్మద్ ఖలీప్ అల్ ముబారక్ కు …అబుదబి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లులు గ్రూపు సీఎండీ యుసుప్ అలీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇక రజనీకాంత్ తన మిత్రుడు లులుగ్రూపు కంపెనీ సీఎండీ యుసుప్‌తో పాటు ఆయన కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో గడిపారు. యుసుప్ ఇంటికి రోల్స్ రాయిస్ కారులో వెళ్లారు. కంపెనీ ఈ వీడియోలను విడుదల చేసింది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే టీజే జ్ఞానవేల్‌కు చెందిన వెట్టియన్‌లో కనబడబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల అవుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, రాణా దగ్గుబాటి నటిస్తున్నారు. త్వరలోనే లోకేష్ కనకరాజ్ చిత్రం కూలీలో నటించనున్నారు. ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది.