Site icon Prime9

Actor Jagadish: ’పుష్ప ‘ నటుడు జగదీశ్ అరెస్ట్

Jagadish

Jagadish

Actor Jagadish: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. పంజాగుట్ట పరిధిలోనివాసముంటున్న ఒక యువతి గత నెల 29న ఆత్మహత్య చేసుకుంది.దీనికి సంబంధించి జగదీశ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఆత్మహత్య కేసులో..(Actor Jagadish)

చనిపోయిన యువతి జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసేది. సదరు మహిళ మరొక వ్యక్తితో ఉండగా జగదీశ్ ఫోటోలు తీసి ఆమెను బెదిరించినట్లు తెలిసింది.దీనితో మనస్తాపానికి గురై ఆమె ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి తండ్రి తన కూతురు మరణానికి జగదీశ్ కారణమని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అప్పటినుంచి పరారీలో ఉన్న జగదీశ్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పుష్ప సినిమాలో కేశవ పాత్రలో నటించిన జగదీశ్ కు మంచి పేరే వచ్చింది. తరువాత అతను పిక్‌ పాకెట్‌, విరాట పర్వం, బుట్ట బొమ్మ సినిమాల్లో నటించాడు. సత్తిగాని రెండెకరాలు అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు. ప్రస్తుతం అతను పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Exit mobile version