Puri Jagannadh : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ గురించి అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం తెలుగు లోనే కాకుండా పలు భాషలలొ సినిమాలను డైరెక్ట్ చేసిన పూరీ… హీరోలకు మాస్ హిట్ లను అందించడంలో సిద్దహస్తుడు అని చెప్పాలి. ఆయన డైరెక్ట్ చేసిన బద్రి, ఇడియట్, చిరుత, బుజ్జిగాడు, టెంపర్, ఇస్మార్ట్ శంకర్, పోకిరి, బిజినెస్ మ్యాన్ ఇలా అన్ని సినిమాలు ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటీవల విజయ్ దేవరకొండతో ” లైగర్ ” సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించినప్పటికి ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
కాగా కోవిడ్ నుంచి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న పూరీ తన మ్యూజింగ్స్ ద్వారా లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్పుకొస్తున్నారు. ఈ మేరకు తాజాగా మరో మ్యూజింగ్స్ ని పోస్ట్ చేశాడు పూరీ జగన్నాధ్. ఆ ఆడియో లో … దేనికైనా బ్యాలన్స్‌డ్‌గా రిప్లై ఇవ్వడం ఎలా అనే అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాకుండా దానికి తన జీవితంలోని ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పారు. ” జీవితంలో చాలా జరుగుతాయి. జరుగుతుంటాయి. వాటి మీద మనకు కంట్రోల్ ఉండవు. ఏం జరిగితే ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే మన చేతుల్లో ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా కామ్‌గా రియాక్ట్ కావాలి. అరిచి గోల చేయడం, తల బాదుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రాబ్లమ్ ఎప్పుడూ ప్రాబ్లమ్ కాదు. ప్రాబ్లమ్‌కు రియాక్ట్ అయ్యే విధానమే అసలు ప్రాబ్లమ్. బ్యాలన్స్‌డ్‌గా ఆలోచించడం, ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఏం మాట్లాడినా మన ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకునే మాట్లాడాలి. కోపంలో ఉంటే కామ్‌గా అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది’ అంటూ చెప్పారు.
అలానే ఇడియట్ సినిమా హీరోయిన్ రక్షిత గురించి చెబుతూ… ఇడియట్ షూటింగ్ టైమ్‌లో రక్షిత ఓ సీన్‌లో ఏడుస్తూ నటించాల్సి ఉండగా ఆమె ఆ ఎమోషన్‌ను సరిగ్గా క్యారీ చేయలేకపోగా నవ్వుతూ ఉందట. దాంతో పూరీ ఒకటి రెండు సార్లు చెప్పినా మళ్ళీ అలానే చేసిందట. ఇక విపరీతంగా కోపమొచ్చి సెట్‌లో అందరి ముందే ‘నువ్వు ఇలాగే చేస్తే నెక్ట్స్ మూవీలో నీకు క్యారెక్టర్ రాయను’ అని చెప్పినట్లు తెలిపారు. అయితే రక్షిత మాత్రం అందుకు బదులుగా ‘నువ్వు నాకు క్యారెక్టర్ రాయకపోతే నిన్ను చంపేస్తాను. మీ తర్వాతి 10 చిత్రాల్లో కూడా నేనే ఉంటాను. ఇప్పుడు ఏం చెయ్యాలో సరిగ్గా చెప్పి చావ్’ అని చెప్పడంతో సెట్‌లో అందరూ నవ్వారంట. ఇక తన కోపం కూడా పోయిందని పూరీ జగన్నాధ్ తెలిపాడు. ఇక సోషల్ మీడియా పోస్టులకు అనవసరంగా స్పందించాల్సిన పనిలేదని.. అంతేకాకుండా ఎక్కడో జరిగిన ఒక ఇష్యూ మీద వైల్డ్‌గా రియాక్ట్ కావాల్సిన అవసరం అంత కన్నా లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.