Site icon Prime9

Prithviraj Sukumaran: రజినీకాంత్ ను కలిసిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ఎందుకో తెలుసా.. ?

Prithviraj Sukumaran: మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మలయాళ పరిశ్రమకే పరిమితమైన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో విలన్ అనగానే ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరే వినిపిస్తుంది. 
ఒకపక్కహీరోగా .. ఇంకోపక్క డైరెక్టర్ గా రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా మారాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం L2: ఎంపురాన్. 2019లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. 
ఇక తాజాగా పృథ్వీరాజ్‌.. సూపర్ స్టార్ రజినీకాంత్ ను మర్యాదపూర్వకంగా మీట్ అయ్యాడు. రజినీ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశాడు.  L2: ఎంపురాన్ ట్రైలర్ మొదట రజినీకి చూపించాలనే వచ్చానని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.” L2: ఎంపురాన్ ట్రైలర్ చూసిన మొట్టమొదటి వ్యక్తి. రజినీ సార్.. ట్రైలర్ చూసి మీరు చెప్పినది నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.ఈ ఆనందం నేను మాటల్లో వర్ణించలేను. ఆయనకు ఎప్పటికీ నేను వీరాభిమానినే” అంటూ రాసుకొచ్చాడు. 
ఇక వీరిద్దరి రిలేషన్ గురించి అందరికీ తెల్సిందే. రజినీకి పృథ్వీరాజ్ వీరాభిమాని. ఒకసారి రజనీకాంత్‌తో సినిమా చేసే అవకాశం కూడా తనకు వచ్చినట్లు L2: ఎంపురాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. లైకా ప్రొడక్షన్స్ అధినేత శుభాస్కరన్ రజినీ సార్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందించారు.  నాకు ఇది చాలా పెద్ద అవకాశం. కొత్త దర్శకుడిగా నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించాను, కానీ సమయం లేక  స్క్రిప్ట్ సిద్ధం చేయలేకపోయాను .అప్పటికే ఆడుజీవితం చిత్ర షెడ్యూల్‌లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు ఆయన సినిమాకు దర్శకత్వం వహిస్తాను” అని చెప్పుకొచ్చాడు. మరి భవిష్యత్తులో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి. 
Exit mobile version
Skip to toolbar