Naatu Naatu Song : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇక ఆస్కార్ గెలుచుకొని ఇండియాకు తిరిగివచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు. ఇక నాటు నాటు సాంగ్ ని అందరూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ సాధించిన తర్వాత చరణ్ ఇండియాలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. నేరుగా ఢిల్లీకి వచ్చిన చరణ్ అక్కడ ఓ జాతీయ మీడియా నిర్వహించిన కాన్ క్లేవ్ లో పాల్గొన్నాడు. అనంతరం చరణ్ హైదరాబాద్ కి చేరుకోగా ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ లభించింది. కాగా తాజాగా చరణ్ RC15 సెట్స్ కి వెళ్ళాడు. ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 మూవీ కోసం ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో 100 మందికి పైగా డాన్సర్స్ తో చరణ్ అండ్ కియారా పై ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. RC15 షూటింగ్ సెట్ లో డాన్సర్స్ తో కలిసి ప్రభుదేవా సాంగ్ డిజైన్ చేస్తున్న సమయంలో చరణ్ అండ్ నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వచ్చారు.
100 మందికి పైగా డాన్సర్స్ తో గ్రాండ్ ట్రిబ్యూట్ ఇచ్చిన ప్రభుదేవా (Naatu Naatu Song)..
కాగా ఈ మేరకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ప్రభుదేవాతో పాటు వందలాది మంది కో డ్యాన్సర్లతో కలసి నాటు నాటు పాటకి స్టెప్పులేస్తూ దుమ్ముదులిపారు. అనంతరం ప్రభుదేవా, రామ్ చరణ్.. నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని సన్మానించారు. కేక్ కటింగ్ కూడా జరిగింది. ఈ వీడియోను రామ్ చరణ్, ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
NAATU NAATU ❤️❤️❤️❤️❤️to the TEAM 🙏 pic.twitter.com/g58cQlubCp
— Prabhudheva (@PDdancing) March 18, 2023
కాగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC15 పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ పూర్తి స్థాయిలో నటిస్తున్న చిత్రం ఇదే. పైగా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ నెల 27న చరణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి CEO ( చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్) అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.