Site icon Prime9

Prabhas Birthday: డార్లింగ్ బర్త్‌డే స్పెషల్‌ – ప్రభాస్‌ రేర్‌ ఫోటోలు వైరల్‌, చూశారా?

నేడు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ బర్త్‌డే. అక్టోబర్‌ 23న డార్లింగ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. చిరంజీవి, రామ్‌ చరణ్‌, త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు, స్టార్‌ హీరోలు, నటీనటులు ప్రభాస్‌కి విషెస్‌ తెలుపుతున్నారు.

అలాగే సోషల్‌ మీడియాలో మొత్తం ఫ్యాన్స్‌ బర్త్‌డే పోస్ట్స్‌, విషెస్‌తో నిండిపోయాయి. మొత్తానికి ఈ బాక్సాఫీసు రారాజు బర్త్‌డేను అభిమానులంతా వేడుకగా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

మరోవైపు ప్రభాస్‌ మూవీ అప్‌డేట్స్‌ వదులుతూ ఫ్యాన్స్‌ని మేకర్స్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంటే.. ప్రభాస్‌ సోదరి, కృష్ణంరాజు కూతురు ఏకంగా డబుల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తన అన్నయ్యకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ వరుసగా చిన్ననాటి ఫోటోలు షేర్‌ చేసింది.

ఇందులో ప్రభాస్‌ యంగేజ్ లుక్‌తో పాటు కృష్ణంరాజుతో ఉన్న పలు అన్‌సీన్‌ పిక్స్‌ కూడా జత చేసింది. అంతేకాదు కృష్ణంరాజు కూతుళ్లతో ప్రభాస్‌ సరదగా ఉన్న, చిన్నప్పుడు వారంత ప్రభాస్‌కు రాఖీ కడుతున్న ఫోటోలు పంచుకుంది.

ఇలా ఫ్యామిలీ అంతా కలిసి పండుగలు, బర్త్‌డేలు సెలబ్రేట్‌ చేసుకున్న పాత ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఓ మూవీ ఈవెంట్‌ కృష్ణంరాజు తన భార్య, కూతుళ్లతో ఉండగా.. ప్రభాస్ పక్కనే ఉన్నాడు. ఇందులో ఈ రెబల్‌ స్టార్‌ యంగ్‌గా కనిపించాడు.

ప్రస్తుతం ఈ ఫోటోలు ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌ ఇస్తున్నాయి. తన అన్నయ్య ప్రభాస్‌కు క్యూట్‌ బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

Exit mobile version