Site icon Prime9

Prabhas : లెక్కల మాస్టర్‌తో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?

prabhas going to act under sukumar direction

prabhas going to act under sukumar direction

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయ‌న సినిమా లైన‌ప్ చూస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అవి ఆసినంచిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి కాగా… ప్రస్తుతం సీజీ వర్క్ నడుస్తుంది. అదే విధంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాకేజ్ట్ కే, మారుతితో కలిసి రాజా డీలక్స్ సినిమాలను చేస్తున్నారు ప్రభాస్.

కాగా ఇప్పుడు ప్రభాస్ మరో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు సుకుమార్. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్… ప్రభాస్ కోసం ఓ కథను రెడీ చేశారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ కథకు ప్రభాస్ కూడా ఓకే చెప్పారని… త్వరలోనే ప్రాజెక్ట్ పట్టాలెక్క నుందని నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వార్తతో ప్రభాస్ అభిమనులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Exit mobile version