Site icon Prime9

Unstoppable 2 : ప్రభాస్, గోపీచంద్ ఏ అమ్మాయి కోసం గొడవ పడ్డారో తెలిసిపోయిందిగా..?

prabhas and gopichand episode in balakrishna unstoppable goes viral

prabhas and gopichand episode in balakrishna unstoppable goes viral

Unstoppable 2 : బాలకృష్ణ “అన్‏స్టాపబుల్” షో దుమ్ము రేపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంతా ఈ షో గురించే చర్చించుకుంటున్నారు. సీజన్ 11 ని తనదైన శైలిలో సక్సెస్ చేసిన బాలయ్య … సీజన్ 2 కి అంతకు మించి సక్సెస్ చేస్తున్నారు. ఈ షోకు సినీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ షో లో పలువురు ప్రముఖులు పాల్గొనగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాకతో సరికొత్త రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పటికే బాహుబలి స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి సందడి చేశారు. వీరికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయగా… ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యింది. అనంతరం ఈ ఎపిసోడ్‏కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2 ని రిలీజ్ చేశారు.

ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్ జనవరి 6న అర్ధరాత్రి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్ చూస్తుంటే వీరిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రభాస్, గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు. వీరిద్దరిని బాలయ్య తనదైన స్టైల్లో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇందులో బాలయ్య అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానాలు అందరికీ నవ్వులు తెప్పించాయి. ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది.

అయితే 2008లో మీరిద్దరూ ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డారట. ఎవరి కోసం అని అడగ్గా… ప్రభాస్ నాకు సంబంధం లేదు… గోపికే తెలుసు చెప్పారు. అందుకు గోపిచంద్ మాట్లాడుతూ… 2008లో కాదు సార్… 2004లో అనుకుంటా. మేమిద్దరం ఓ హీరోయిన్ కోసం గొడవపడ్డాం అన్నారు. ఎవరు ఆ హీరోయిన్ అంటూ బాలయ్య అడగ్గా… త్రిష అంటూ చెప్పుకొచ్చాడు. గోపిచంద్ ఆన్సర్ విని ప్రభాస్, బాలయ్య షాకయ్యారు. వర్షం సినిమాలో త్రిష కోసం మేము కొట్టుకున్నాం సార్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ గా మారింది.

 

Exit mobile version