Pil Filed On Pushp 2 Profits: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. బెనిఫిట్ షోతో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు కేవరంలో ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. రిలీజైనప్పటి నుంచి రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతూ, కలెక్షన్స్ పంచుకుంటూ ఇండియన్ బాక్సాఫీసు వద్ద గట్టి రిసౌండ్ చేసింది. ఫైనల్‌గా అత్యధిక వసూళ్లు సాధించిర రెండు భారతీయ సినిమాగా బాక్సాఫీసు వద్ద సత్తాచాటింది. మొత్తంగా రూ. 1871 పైగా కోట్ల గ్రాస్ చేసినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.
పుష్ప2కి భారీ ఆదాయం..
అయితే ‘పుష్ప 2’ ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. అయినా కానీ పుష్ప 2 వసూళ్లు మాత్రం వసూళ్లలో తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోయింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే తాజాగా పుష్ప 2 లాభాలు అంశం కోర్టుకు వరకు వెళ్లింది. పుష్ప 2 సినిమాకు వచ్చిన లాభాలను తెలంగాణ జానపద కళాకారుల పింఛన్‌కు కెటాయించాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. న్యాయవాది నరసింహారావు ఈ పిల్‌ను దాఖలు చేశారు. బెనిఫిట్ షో లు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప 2 చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
సుప్రీం కోర్టు తీప్పు ప్రకారం..
హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వుల ఇచ్చి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చిందన్నారు. అయితే ఏ ప్రతిపదికన బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో చెప్పాలేదన్నారు. కావునా.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి, జానపద కళాకారుల సంక్షేమం కోసం కేటాయించాలని ఆయన కోరారు. ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు అయిపోయింది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అవును.. బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు వల్ల వచ్చిన లాభాల గురించే తాము ఈ పిల్ వేశామని ఆయన స్పష్టం చేశారు. వాదనలు వి్న అనంతరం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.