Site icon Prime9

Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’.. నాలుగు గంటల్లోనే డబ్బింగ్‌ పూర్తి చేసిన పవర్‌ స్టార్‌

Pawan Kalyan Completes Hari Hara Veeramallu Dubbing: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జూన్‌ 12న ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది. షూటింగ్‌ పూర్తయిన పవన్‌కి సంబంధించిన ఆడపదడప సీన్స్‌ మిగిలి ఉండటంతో వాటిని నిన్న బుధవారం సాయంత్రం పూర్తి చేశారు పనవ్‌ కళ్యాణ్‌. రాత్రి 10 గంటలకు ఆయన షూటింగ్‌ పూర్తయ్యింది.

 

పనిలో పనిగా అదే రోజు డబ్బింగ్‌ కూడా పూర్తి చేశారాయన. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. ముంబైలోని స్టూడియోలో పవన్‌ కళ్యాణ్‌ డబ్బింగ్‌ చెబుతున్న ఫోటోని షేర్‌ చేసింది మూవీ టీం. కేవలం నాలుగు గంటల్లోనే ఆయన ఎంటైర్‌ మూవీకి డబ్బింగ్‌ చెప్పినట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు. షూటింగ్‌ పూర్తయిన అదే రోజు రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ స్టార్ట్‌ చేసి ఎకధాటిగా దానిని నాలుగు గంటల్లో పూర్తి చేశారు. ఈ విషయాన్ని చెబుతూ మూవీ టీం ట్వీట్‌ చేసింది.

 

“హరి హర వీరమల్లుకు పవన్‌ కళ్యాన్‌ డబ్బింగ్‌ పూర్తయ్యింది. ఫోకస్‌ అండ్‌ ఫైర్‌తో అన్‌స్టాపబుల్‌ డబ్బింగ్‌ పూర్తి చేశారు. ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్‌ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలవగా ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేశారు. జూన్‌ 12న ఈ పవర్‌ తుఫాన్‌కు సిద్ధంగా ఉండండి” అని మూవీ టీం పోస్ట్‌లో పేర్కొంది. నాలుగు గంటల్లోనే డబ్బింగ్‌ వర్క్‌ పూర్తి చేసిన పవన్‌ డెడికెషన్‌, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్‌ను అభిమానులు, ఆడియన్స్‌ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 

కాగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ 18వ శతాబ్ధం కాలం నాటి స్వతంత్ర్య సమర యోధుడిగా కనిపించనున్నారు. ఇందులో నిధి అగ్వారల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్‌ ప్రతికథానాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే అనుపమ్‌ ఖేర్‌, సత్యరాజ్‌, అర్జున్‌ రాంపాల్‌, శుభలేఖ సుధాకర్‌ వంటి తదితర నటులు నటిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రిలీజ్‌ అవుతున్న చిత్రమిది. ఎన్నో వాయిదాల తర్వాత హరి హర వీరమల్లు థియేటర్లలో వస్తుండటంతో అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar