Site icon Prime9

Pawan Kalyan: ఏంటి.. ఉస్తాద్ కోసం పవన్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా.. ?

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి పక్కన పెడితే.. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, OG, ఉస్తాద్ భగత్ సింగ్. కనీసం మొదటి రెండు సినిమాలకు షూటింగ్ సగం అయినా పూర్తి అయ్యింది. కానీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదని టాక్. కేవలం పోస్టర్స్, టీజర్ కోసం కొద్దిగా షూట్ చేసారని సమాచారం.

 

పవన్ పదవి కారణంగా ఈ మూడు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. హరిహర వీరమల్లును మొదట క్రిష్ దర్శకత్వం వహించాడు. కొంత షూట్ చేసి.. పవన్ డేట్స్ కోసం ఎదురు చూసి చూసి ఆయన తప్పుకున్నాడు. ఎలాగోలా జ్యోతి కృష్ణ మిగతా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాను ఫినిష్ చేశాడు. కానీ, రిలీజ్ కు మాత్రం నోచుకోలేకపోతుంది ఈ సినిమా.

 

ఇక OG గురించి చెప్పాలంటే.. దాదాపు 60 శాతం షూటింగ్ ను ఫినిష్ చేశారని టాక్. మిగతా 40 శాతం షూటింగ్ ఫినిష్ చేయడానికి పవన్ ఎప్పుడూ వస్తాడా అని సుజిత్ ఎదురుచూస్తున్నాడు. ఇక మూడో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి నుంచి షూట్ చేయాలి. ఇదే ఎక్కువ సమయం పడుతుందని టాక్.

 

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ అక్షరాలా రూ. 170 కోట్లు తీసుకుంటున్నాడట. డిప్యూటీ సీఎం అయ్యాక.. పవన్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు మాత్రమే ఉంటారు అన్న విషయం కూడా తెల్సిందే.

 

ఇక మార్కెట్ లో పవన్ సినిమా కనిపించి కూడా చాలా కాలం అయ్యింది. ఈ సినిమా రిలీజ్  అయ్యే సమయానికి హరిహర వీరమల్లు, OG లలో ఏదైనా ఒకటి రిలీజ్ అవ్వడం ఖాయం. బిజినెస్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఓటీటీలు క్యూ కడతాయి. ఇన్ని ఉంటే ఆ మాత్రం రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version
Skip to toolbar