Site icon Prime9

Pawan Kalyan: వైరల్‌గా పవన్‌ కళ్యాణ్‌ ‘ఓజీ’ రిలీజ్‌ డేట్‌ – అప్పుడే థియేటర్లోకి..

Pawan Kalyan OG Release Date: పవన్‌ కళ్యాన్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ఓజీ ఒకటి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఓజీపైనే అందరి దృష్టి ఉంది. సాహో ఫేం సుజీత్‌ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా 30 శాతం షూటింగ్‌ జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఆయన గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇటూ రాజకీయాలు, అటూ సినిమా షూటింగ్‌లను బ్యాలెన్స్‌ చేస్తూ వస్తున్నాయి.

 

అయితే ఇందులో ఎక్కువగా ఆయన ప్రజలకు సేవలందించడానికి సమయం కెటాయిస్తున్నారు. దీంతో ఆయన సినిమాల షూటింగ్స్‌కి తరచూ బ్రేక్‌ పడుతోంది. ఇప్పటికే హరి హర వీరమల్లు షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌, టాకీ వర్క్‌ని జరుపుకుంటుంది. మరికొన్ని రోజుల్లోనే హరి హర వీరమల్లు ప్రమోషనల్‌ కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. దీంతో పవన్‌ నెక్ట్స్‌ ఓజీ మూవీ షూటింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లోనే ఆయన సెట్లో అడుగుపెట్టబోతున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ని చకచక పూర్తి చేసి సెప్టెంబర్‌ రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు గుసగుస వినిపిస్తున్నాయి.

 

ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తన సినిమాల నిర్మాతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఏ సినిమాకు ఎన్నిరోజుల డేట్స్‌ కావాలి, ఇంక ఎంత షూటింగ్‌ మిగిలి ఉందో అని తెలుసుకున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్‌ 5న థియేటర్లలో తీసుకురావాలని మూవీ టీం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకున్నట్టుగానే ఓజీ మూవీ సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయగలిగితే.. ఆ వెంటనే మరో నాలుగు నెలల్లో ఆయన తదుపరి చిత్రాలను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

 

కాగా సుజీత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ సరసన ప్రియాంక మోహన్‌ అరుళ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో ఓజీ కథ సాగనుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు సినిమా రిలీజ్ డేట్ పై మూవీ టీం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. చూస్తుంటే మే 9న కూడా వీరమల్లు వచ్చేలా కనిపించడం లేదు. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది తెలియాలంటే మూవీ టీం నుంచి ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version
Skip to toolbar