Site icon Prime9

Unstoppable 2 : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ మిగిల్చిన ఆహా… సంక్రాంతికి పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లేనట్లేనా?

pawan kalyan fans disappointed with aha update on unstoppable show

pawan kalyan fans disappointed with aha update on unstoppable show

Unstoppable 2 : ప్రస్తుతం అటు సోషల్ మీడియా లోనూ… ఆఫ్ లైన్ లోనూ ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం అన్‌స్టాపబుల్ 2 టాక్ షో. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య… ఈ సీజన్ 2 ని మరింతగా సక్సెస్ చేస్తున్నారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. ఇక ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా రాగా… ఈ ఎపిసోడ్‌ను భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో భాగాన్ని జనవరి 6న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా తెలిపింది.

అయితే మరో వైపు ఈ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో పాటు క్రిష్‌ ఈ షో లో పాల్గొన్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలోనే 27వ తేదీన అన్నపూర్ణ స్టూడియో లో ఈ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ జరిగింది. అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోకు పెద్ద ఎత్తున చేరుకొని ఓ రేంజ్ లో హంగామా చేశారు. గెస్ట్ లతో తనదైన శైలిలో ఆడుకుంటున్న బాలయ్య… పవన్ కళ్యాణ్ ని ఏమని ప్రశ్నలు అడుగుతారు. వారి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అని నందమూరి, మెగా ఫ్యామిలీల అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

కాగా ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు, సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌ను ఏరోజున స్ట్రీమింగ్ చేస్తారా అనే విషయంపై ఆహా తాజాగా క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పాల్గొన్న అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 13న స్ట్రీమింగ్ చేస్తారని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ వారి ఆశయాలను అడియాసలు చేస్తూ ఆహా వారందరికీ షాక్ ఇచ్చింది. అన్‌స్టాపబుల్ 2 కు సంబంధించి త్వరలో ఎప్పుడు ఏ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందో తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం 13 వ తేదీన బాలయ్య వీర సింహారెడ్డి టీమ్ ఈ షో లో సందడి చేయనున్నట్లు అర్దం అవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా నిరాశ చెందుతున్నారు.

 

Exit mobile version