Prime9

Pawan Kalyan: ఓజీ షూటింగ్‌ పూర్తి – ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్లో అడుగుపెట్టిన పవర్‌ స్టార్‌

Pawan Kalyan Joins in Ustaad Bhagat Singh Movie Shooting: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తను కమిటైన ప్రాజెక్ట్స్‌ని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అసుల ఆయన సినిమాల షూటింగ్‌ పూర్తవుతుందా? లేదా? అని ప్రశ్నించిన వారికి దిమ్మతిరిగేలా సమాధానం ఇస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్‌ పూర్తి చేశారు. ఆయన సంబంధించిన షూటింగ్ పార్ట్‌ పూర్తి వెంటవెంటనే డబ్బింగ్‌ కూడా చెప్పేస్తున్నారు. షూటింగ్‌ సెట్లో ఇలా ఎంట్రీ ఇస్తున్నారో లేదో.. రోజుల వ్యవధిలో పూర్తి చేసేస్తున్నారు.

 

ఇక ఫైనల్‌గా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభిస్తామని ఇటీవల మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. ఇక చెప్పినట్టుగానే మూవీ షూటింగ్‌ మొదలైంది. తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెట్‌లో పవన్‌ అడుగుపెట్టారు. తాజాగా ఆయన షూటింగ్‌ జాయిన్‌ అయ్యారంటూ మూవీ మేకర్స్‌ ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. సుధీర్ఘ విరామంతో నేడు మంగళవారం హైదరాబాద్‌లో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ మూవీ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో ఆఫీషియల్‌ పవన్‌ పాల్గొన్నారు.

 

పవన్‌ రాకతో మూవీ సెట్స్‌లో సందడి నెలకొంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు ఇతర కీలక పాత్రలు కూడా పాల్గొన్నట్టు సమాచారం. కాగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ గబ్బర్‌ సింగ్‌ తర్వాత దర్శకుడు హరీష్‌ శంకర్‌, పవన్‌ కళ్యాణ్‌ కాంబోలో వస్తున్న చిత్రమిది. కేవలం 20 శాతం షూటింగ్‌ని మాత్రమే జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌.. ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయింది. ఇక ఈ చిత్రం అసలు ఉంటుందా? లేదా? ఎన్నో సందేహాలు నెలకొన్న వేళ.. ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభకానుందని అప్‌డేట్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు మేకర్స్‌.

 

జరిగిన కొంత భాగం షూటింగ్‌ నుంచి ఫ్యాన్స్‌ ఊహించినదానికంటే మించి గ్లింప్స్ రెడీ చేసి వదిలాడు శంకర్‌. ఎన్నికల సమయంలో విడుదలైన ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో దీనికి అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా నంచి వచ్చి పోస్టర్స్‌, గ్లింప్స్‌, స్పెషల్‌ వీడియోలు అన్ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై మంచి బజ్‌ నెలకొంది. ఇదిలా ఉంటే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ యర్నేనీ, రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar