Aha Na Pelanta: జీ5లో రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’. నవంబర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడుతో వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
ఈ వెబ్ సిరీస్ అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ మార్క్‌ను రీచ్ అయ్యింది. అంతే కాకుండా ఐఎండీబీ ప్రకటించిన టాప్ టెన్ ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్‌ల లిస్టులోనూ ‘అహ నా పెళ్ళంట’ చోటు దక్కించుకుంది. తెలుగులో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనింగ్ సిరీస్‌ను అన్నీ భాషల్లో ప్రమోట్ చేశారు. కంటెంట్ చాలా బావుందని అన్నీ చోట్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ శివానీ రాజశేఖర్ మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలైట్ అని అందరూ అంటున్నారు.