Pawan Kalyan In Unstoppable 2:నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయింది.
ఈ షోలో ఇప్పటివరకూ ప్రసారుమయిన ఎపిసోడ్ లు ఒకెత్తయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మరొక ఎత్తు.
నిజం చెప్పాలంటే అహా ఓటీటీ చరిత్రలో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది.
వ్యూయర్స్ తాకిడికి సర్వర్ క్రాష్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్.. (Pawan Kalyan In Unstoppable 2)
బాలయ్య ప్రశ్నలు వాటికి తనదైన శైలిలో పవన్ జవాబులతో ఫస్ట్ పార్ట్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
బాలయ్య-పవన్ కళ్యాణ్ టాక్ షో మొదటి భాగం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు ఆహా తెలిపింది.
ఈ సందర్భంగా పవన్ అభిమానులకు, ఆహా సబ్‌స్క్రైబర్లకు ధన్యవాదాలు తెలిపింది.
తాజాగా ఈ ఇంటర్యూ రెండవ పార్ట్ ప్రోమో అహా ఓటీటీ విడుదల చేసింది.
కొద్దినెలల కిందట పవన్ కళ్యాణ్ కారు టాప్ పై కూర్చుని ప్రయాణించడంపై బాలయ్య ప్రశ్నించారు.
కారులో ప్రయాణించకూడదు, కూర్చోకూడదు అంటూ సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో చిరాకేసిందని పవన్ చెప్పారు.
అధికారయంత్రాంగం హద్దులు మీరుతోంది.. పవన్ కళ్యాణ్
అధికార యంత్రాంగం కూడా హద్దులు మీరుతోంది.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2)
రాజకీయాల్లో ఆధిపత్య ధోరణి నడుస్తోందని ఇది మంచిది కాదని పవన్ అన్నారు.
పవన్ సొంతంగా పార్టీ పెట్డడం గురించి బాలకృష్ణ ప్రశ్నించారు. టీడీపీలో చేరవచ్చుకదా అని ప్రశ్నించారు.
ఇకపై సినిమాలు మానేసి రాజకీయాలు చేయాలంటూ బాలకృష్ణ చెప్పడంతో పవన్ ఏదో రాస్తూ కనిపిస్తారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం. దాని తరువాత పరిణామాల గురించి ఈ ఎపిసోడ్ లో వివరిస్తారని భావిస్తున్నారు.
ఫిభ్రవరి 9 రాత్రి 9 గంటలకు పవన్ కళ్యాణ్ రెండవ ఎపిసోడ్ ..
వాస్తవానికి ఈ ఎపిసోడ్ ఫిభ్రవరి 10న ప్రసారం కానుండగా అహా ఓటీటీ తన పుట్టినరోజు సందర్బంగా ఒక రోజు ముందే అంటే
ఫిభ్రవరి 9న ప్రసారం చేస్తున్నట్లు ట్విట్టర్ లో తెలిపింది.
9PM ఇది మన Bdayలో NO అని ఎలా చెప్పగలం! అన్ని ఎపిసోడ్‌ల బాప్ పార్ట్ 2 ఫిబ్రవరి 9 @ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ అవుతుంది.
#PawanKalyanOnAHA ఇంకా రచ్చ మొదలైందమ్మా 1 రోజు మిగిలి ఉంది అంటూ ట్వీట్ చేసింది.
ఇంటర్యూ మొదటి పార్ట లో పవన్ తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు.
పవన్ చిన్ననాటి జీవితం.. సినిమా రంగంలోకి వచ్చిన మార్పులను అభిమానులకు తెలియజేశాడు.
తనలో జరిగిన మానసిక సంఘర్షణను పవన్ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.
ఒకానొక సమయంలో.. తను గన్ పట్టుకున్న సమయాన్ని కూడా పవన్ అభిమానులకు తెలిపారు.
రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ లకు పవన్ ఎలా సన్నిహితంగా మారారో ఇందులో చక్కగా వివరించారు.
రాజకీయాలు.. సమాజానికి చేయాల్సిన సేవను పవన్ ఈ షో లో తెలిపారు.
పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడేవారు ఊరకుక్కలు..
ఈ పెళ్ళిళ్ళ గొడవేంటి భయ్యా? అన్న ప్రశ్నకు పవన్ ఏ మాత్రం దాచుకోకుండా అన్నీ వివరించిన విధానం కూడా అలరిస్తుంది.
అంతా విన్న తరువాత బాలయ్య, ఇకపై పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం”
అంటూ అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.
ఈ ఎపిసోడ్ లో వీరిద్దరి డైలాగ్స్ షో కి హైలైట్ గా మారాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/