Prime9

Kerala Crime Files 2: ఓటీటీకి వస్తోన్న మరో క్రైం థ్రిల్లర్‌ ‘కేరళ క్రైం ఫైల్స్ 2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..?

Kerala Crime Files Season 2 Web Series OTT Release Date: హారర్‌, క్రైం థ్రిల్లర్స్‌కి ఆడియన్స్‌ ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్స్‌ ఆడియన్స్‌కి మంచి థ్రిల్‌ని ఇస్తాయి. సస్పెన్స్‌తో సాగే ఈ థ్రిల్లర్‌ సినిమాలుకు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఓటీటీలో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలో ఓటీటీలో సందడి చేస్తుంటాయి.

 

అలాగే ఈ వారంలో ఓ క్రైం థ్రిల్లర్‌ సినిమా రాబోతోంది. అదే ‘కేరళ క్రైం ఫైల్స్‌ ‘ మరో సీజన్‌. ఈ సెకండ్‌ సీజన్‌ను త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. 2023లో ZEE5 వేదికగా విడుదలైన ‘కేరళ క్రైం ఫైల్స్‌’ తొలి సీజన్‌ మంచి ఆదరణ పొందింది. ఓటీటీలో ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రెండేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా ‘కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు’ కొత్త సీజన్‌ని తీసుకువస్తున్నారు.

 

తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీయో హాట్‌స్టార్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తూ విడుదల తేదీని కూడా ప్రకించారు. జూన్‌ 20న మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ బాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా కేరళ క్రైం ఫైల్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. అహ్మద్‌ కబీర్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి అజు వర్గీస్‌, జిన్జ్‌ వన్‌, లాల్‌, శ్రీజిత్‌ మహాదేవన్‌, నివాస్‌ వాలిక్కున్నులు ముఖ్యపాత్రలు పోషించారు.

 

ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ సిరీస్‌పై ఆద్యాంతం ఆసక్తిని పెంచుతుంది. ఓ మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సెకండ్‌ సీజన్‌ సాగనుందని అర్థమైపోతుంది. ‘టీం మొత్తం కొత్తది కాబట్టి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. అయినా ఇది ఒక పెట్టె తెరవడం లాంటిది. లోపల ఉన్నది బంగారమో, భూతమో తెరిచే వరకూ తెలియదు’ అంటూ ట్రైలర్ మొదలవుతుంది. ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కోసం పోలీసులే వెతుకుతున్నారని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. అసలు ఆ పోలీసు ఆఫీసర్‌ ఎరవు? అతడు ఏం చేశాడు? జరిగిన క్రైంకి అతడికి సంబంధమేంటనేది ‘కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు’ సిరీస్‌.

 

Kerala Crime Files Season 2 | Trailer 2 | JioHotstar | June 20

Exit mobile version
Skip to toolbar