Mr & Mrs Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
487 మంది కొత్త సభ్యులు..(Mr & Mrs Rajamouli)
RRR అకాడమీ అవార్డును అందుకున్న తర్వాత, నిర్వాహకులు రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ మరియు సాబు సిరిల్‌లను కొత్త సభ్యులుగా తమ జ్యూరీలో చేరమని ఆహ్వానాలు పంపారు. దర్శకుల విభాగంలో అకాడమీలో చేరాల్సిందిగా రాజమౌళికి ఆహ్వానం అందగా, కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఆయన భార్య రమా అవార్డు అందుకున్నారు.487 మంది కొత్త సభ్యులు అకాడమీలో చేరడానికి ఆహ్వానించబడ్డారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంఖ్య 10,910కి చేరింది. అకాడెమీకి కొత్తగా ఆహ్వానించబడిన మా సభ్యులను ప్రకటించినందుకు మేము గర్విస్తున్నాము అంటూ అకాడమీ తెలిపింది. కొత్త జాబితాలో భారతీయ సెలబ్రిటీలు షబానా అజ్మీ, రవి వర్మన్, హేమల్ త్రివేది, నిషా పహుజా మరియు రితేష్ సిధ్వానీ కూడా ఉన్నారు.