Oscars 2023: సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
అయితే, ఈ ఏడాది ఆస్కార్స్ సాధించిన సినిమాల గురించి అభిమానులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’సినిమా ఏకంగా ఏడు అవార్డులను అందుకుని విజయకేతనం ఎగుర వేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. దీంతో ఆస్కార్ అవార్డులు గెలిచిన అన్ని సినిమాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.
ఏడు అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన సినిమా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. భారత్ నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరిస్తోంది.
ఏ ఓటీటీలో ఏ సినిమా అంటే.. (Oscars 2023)
సోనీలీవ్ (SonyLiv)లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
నెట్‌ఫ్లిక్స్ లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ లో అవార్డు అందకున్న ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ ఉంది.
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ లో బ్లాక్‌పాంథర్-వకండా ఫరెవర్ కు అవార్డు వచ్చింది. ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్ లో వీక్షించొచ్చు.
అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్‌స్టార్ లలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్నఅవతార్ 2 రెంట్ బేస్ పై త్వరలో అందుబాటులోకి
అమెజాన్ ప్రైమ్ వీడియో లో బెస్ట్ సౌండ్ లో అవార్డు గెలుచుకున్న టాప్ గన్: మావెరిక్ అందుబాటులో ఉంది.
జీ5, డిస్నీ + హాట్ స్టార్‌లలో ఆర్‌ఆర్‌ఆర్ ను చూడొచ్చు.
డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్‌ఫ్లిక్స్ లో అలరిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ పినాషియో ను చూడొచ్చు.
ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్.. చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేవు.