Tollywood: ఉదయ్ శంకర్ హీరోగా, జెన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన “నచ్చింది గాళ్ల ఫ్రెండూ” సినిమా ఈ నెల 11న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తొలిసారిగా గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీరామ్ ఆర్ట్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు “నచ్చింది గాళ్ల ఫ్రెండూ” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు.
సినిమాలో శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్, సీనియర్ నటుడు సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వైజాగ్ నేపథ్యంగా సాగిన థ్రిల్లర్ ఎలిమెంట్ తో “నచ్చింది గాళ్ల ఫ్రెండూ” చిత్రాన్ని నిర్మించారు. కథను ఎక్కువగా రోడ్ జర్నీని తలపిస్తూ చిత్రంలో ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ చేసిన హీరో ఛేజ్ తో లవ్ లో పడ్డ హీరోయిన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే హీరో ఉదయశంకర్ తను ఎవరినైనా అమ్మాయిని ఇష్టపడితే ఆమెను ప్రేమలో పడేయడంలో దిట్ట. ఈ సినిమాకు ముందు హీరోయిన్ జెన్నీఫర్ ఓ చిన్న సినిమాలో నటించింది.
దర్శకుడు గురు పవన్ ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందకు చాలా కష్టపడ్డారు. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ఓ ఇన్వెస్ట్ మెంటు యాప్ లో చోటుచేసుకొన్న తప్పుతో ఎంతమంది నష్టపోతారో తెలియచెప్పేందుకు ప్రయత్నించారు. ఇన్వెస్ట్ మెంట్ యాప్ లో కల్గిన సమస్యను ఒక హీరోలా కాకుండా సాధారణ వ్యక్తిగా హీరో ఉదయ శంకర్ ఎలా పరిష్కరించాడో తెలియచేశారు. ఈ ఘటనా నేపథ్యానికి ప్రేమ కథకు ముడిపెడుతూ సినిమాను చిత్రీకరించారు.
సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ, గిఫ్టన్ మ్యూజిక్ లు హైలెట్ ఉండనున్నాయి. ఎడిటర్ జునాయిద్ సిద్దిఖి, ఆర్ట్ దొలూరి నారాయణ, తదితరులు చిత్ర నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. గతంలో ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ వంటి చిత్రాల్లో హీరో ఉదయ శంకర్ నటించారు. ఈ సినిమా కూడా ఉదయ్ కెరీర్ లో ఓ డిఫరెంట్ మూవీగా ఉండనుందని దర్శకుడు గురు పవన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న నటి ఆలియా భట్.. రిలయన్స్ వైద్యశాలలో చేరిక..