Site icon Prime9

Varun Tej – Lavanya Tripathi Engagement : అఫిషియల్.. అఫిషియల్.. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ డేట్ ఫిక్స్

official update on varun tej - lavanya tripathi engagement

official update on varun tej - lavanya tripathi engagement

Varun Tej – Lavanya Tripathi Engagement : మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన రూమర్స్ ఇప్పుడు ఎట్టకేలకు నిజమయ్యాయని సమాచారం అందుతుంది. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు అని వార్తలు కోడై కూస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది. వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ ఓ కార్డ్‌ను పలువురు ప్రముఖులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

ఆ కార్డ్ లో వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని రాసి ఉంది . బంధుమిత్రులతో పాటు కొంతమంది సెలబ్రిటీల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరనుందని సమాచారం.పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘానికి చెందిన శివ చెర్రీ అనే అభిమాని ఒక నోట్ రిలీజ్ చేశాడు. కంగ్రాట్యులేషన్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి అంటూ ఎంగేజ్మెంట్ డేట్ తో ఉన్న ఒక కార్డుని పోస్ట్ చేశాడు. ఇక మెగా ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉండే శివ చెర్రీ ఈ పోస్ట్ వెయ్యడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ అంతా వరుణ్ అండ్ లావణ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రేపు (జూన్ 9) జరగబోయే ఈ నిశ్చితార్ధ వేడుకని మెగా హీరోలు ఎంత ఘనంగా చేస్తారో, టాలీవుడ్ నుంచి ఎవరెవరు ఈ వేడుకకు హాజరవుతారు అని అందరిలో ఆసక్తి నెలకుంది.

 

కాగా.. 2017లో మిస్టర్ చిత్రం సెట్స్‌లో తొలిసారిగా ఈ జంట (Varun Tej – Lavanya Tripathi Engagement) కలుసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి నటించారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడిందని.. అప్పటి నుంచి సినీవర్గాల్లో వీరి ప్రేమ విషయంపై గుసగుసలు మెుదలయ్యాయి. దీంతో సోషల్‌ మీడియాలో సైతం వీరి ప్రేమ పుకార్లు వెల్లువలా వచ్చేవి. ఇక ఎట్టకేలకు వరుణ్‌, లావణ్య పెళ్లి పీటలు ఎక్కనుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.

ఇక వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న `గాండీవధారి అర్జున` చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తో మరో చిత్రం చేస్తున్నారు. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.

Exit mobile version