Prime9

Nara Rohit: పవన్‌ ‘ఓజీ’లో నారా రోహిత్‌ కాబోయే భార్య – అసలు విషయం చెప్పేసిన హీరో

Nara Rohit Fiance and Actress Shirisha in OG Movie: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఓజీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ రివీల్‌ చేశాడు హీరో నారా రోహిత్‌. ప్రస్తుతం నారా రోహిత్‌ భైరవం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 30న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.

 

భైరవం టీం ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. ఇందులో భాగంగా బుధవారం భైరవం టీం ఓ స్పెషల్‌ ఇంటర్య్వూలో ప్లాన్‌ చేసింది. మెగా హీరో సాయి దుర్గతేజ్‌తో కలిసి భైరవం హీరోలతో చిట్‌చాట్‌ జరిగింది. ఎంతో ఫన్నీగా జరిగి ఈ ఇంటర్య్వూలో నారా రోహిత్‌ తన కాభోయే భార్య గురించి ఆసక్తికర విషయం చెప్పాడు. తన ఫియాన్సీ శిరీష లేళ్ల ఓజీ నటించే చాన్స్‌ అందుకుందని చెప్పి అందరిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఈ సందర్భంగా రోహిత్‌ మాట్లాడుతూ. .”ఓజీలో నా కాబోయే భార్య శీరీషా కూడా నటించారు. కీలక పాత్రలో ఆమెకు అవకాశం దక్కింది” అని రివీల్‌ చేశాడు.

 

ప్రస్తుతం అతడి కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా గతేడాది అక్టోబర్‌లో నారా రోహిత్‌, శీరీషల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ప్రతినిథి 2లో శీరీష రోహిత్‌ సరసన నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ టైంలో ప్రేమలో పడ్డ వీరు పెద్ద అంగీకారంతో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతోన్నారు. ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటోంది. సాహో ఫేం సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న ఓజీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar