Site icon Prime9

Nani: రిపబ్లిక్‌ డే స్పెషల్‌, హాట్‌ 3 నుంచి కొత్త అప్‌డేట్‌ – గన్‌తో సెల్యూట్‌ కొడుతున్న నాని..

Nani New Look From Hit 3 Movie: నేచురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్‌లో ఉంగానే మరో సినిమాని లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా మరోకటి హిట్‌ ఫ్రాంచైజ్‌ నుంచి రాబోతోన్న ‘హిట్‌ 3’. హిట్ 1, హిట్‌ 2 చిత్రాలకు సమర్పకుడుగా ఉన్న నాని ఈసారి సినిమాలో నటిస్తూ సమర్పించబోతున్నాడు. శైలేష్‌ కోలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాని అర్జున్‌ సర్కార్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈచిత్రం నుంచి రిపబ్లిక్‌డే సందర్భంగా సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఇందులో నాని లుక్‌ని పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ గన్‌తో సెల్యూట్‌ చేస్తున్న అర్జున్‌ సర్కార్‌ పోస్టర్‌ షేర్‌ చేశాడు. ఇందులో నాని పోలీసుల ఆఫీసర్‌గా స్ట్రైక్‌ లుక్‌లో ఆకట్టుకున్నాడు. కాగా వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మే 1న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Exit mobile version
Skip to toolbar