Site icon Prime9

Nandamuri Tarakaratna : ఇదే చివరి ఫోటో అవుతుంది అనుకోలేదంటూ తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

nandamuri tarakaratna wife emotionalpost on social media goes viral

nandamuri tarakaratna wife emotionalpost on social media goes viral

Nandamuri Tarakaratna :  నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకోని రీతిలో తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఆమెను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆమె మాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతోంది అనిపిస్తుంది.

అలేఖ్య కోసం నాలుగేళ్ళు కుటుంబానికి దూరంగా (Nandamuri Tarakaratna)..

అనంతపురం జిల్లాకు చెందిన మధు సూదన్‌రెడ్డి కుమార్తె. అలానే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. భార్య చెల్లెలి కుమార్తె గా అత్యంత దగ్గరి బంధువులు. కాగా తారకరత్న హీరోగా నటించిన ‘నందీశ్వర’ సినిమాకు అలేఖ్యరెడ్డి కాస్టూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయి విడాకులు తీసుకున్న అలేఖ్యను పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబీకులు ఆమోదించలేదు. దీంతో వారిద్దరూ 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు. 2013 డిసెంబర్ 21 వీరిద్దరికి పాప జన్మించింది. ఆ అమ్మాయికి.. నిష్క అని నామకరణం చేశారు. 2014లో జరిగిన తన సోదరి రూప పెళ్లికి కూడా తారకరత్న వెళ్లలేకపోయాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

అయితే తాజాగా తన భర్త, పిల్లలతో కలిసున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి మరోసారి భావోద్వేగానికి గురైంది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదట తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న అలేఖ్య.. ‘ఇదే మా చివరి ఫోటో, చివరి ప్రయాణం అని నమ్మడం నా హృదయం పగిలినట్లు ఉంది. ‘నన్ను మా అమ్మా బంగారు’ అని పిలిచే మీ స్వరం మరోసారి వినాలని ఉంది’ అని ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తారకరత్న అభిమానులు, నెటిజన్లు అలేఖ్యకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

టీడీపీ యువనేత నారా లోకేశ్‌ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగళూరులోని ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. అయితే ఫిబ్రవరి 18న ఆయన తుదిశ్వాస విడిచాడు. ఇటీవల ఆయన చిన్మకర్మను నిర్వహించారు. ఇక మార్చి 2న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్‌ సెంటర్‌లో తారకరత్న పెద్దకర్మను నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం ‘అమరావతి’తో  రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ ‘9 అవర్స్’లో సీఐ రోల్ చేశారు. బాలయ్య సినిమాలో నటించాలి అనే కోరిక తీరకుండానే తారక రత్న ఈ లోకాన్ని వీడడం ఎంతో బాధాకరం.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version