Site icon Prime9

Nandamuri Balakrishna: ఇకపై పద్మ భూషణ్ బాలకృష్ణ – తెలుగుదనం ఉట్టిపడేలా.. పంచెకట్టులో బాలయ్య

Balakrishna Received Padma Bhushan Award: నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ పుర్కస్కారాన్ని అందజేశారు. ఇవాళ (ఏప్రిల్‌ 28) రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానొత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాసేపటికే క్రితమే బాలయ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

 

ఈ సందర్భంగా బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టు అవార్డు ప్రదానొత్సవానికి హాజరయ్యారు. ఢిల్లీలోని మాన్‌సింగ్‌ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్‌కు కుటుంబంతో కలిసి ఆయన వెళ్లారు. కాగా అవార్డుల కార్యక్రమానికి బాలయ్య సతీమణి వసుధర, కూతురు బ్రహ్మాణి, అల్లుడు నారా లోకేష్‌తో పాటు సోదరి నారా భువనేశ్వరి, చిన్న కూతురు-అల్లుడు తేజస్వీని, భరత్‌, మనవళ్లు, కొడుకు మోక్షజ్ఞతో కూడా వెళ్లారు. కాగా చలనచిత్ర రంగంలో 50 ఏళ్లకు పైగా విశేష సేవలు అందిస్తున్నందుకు గానూ బాలయ్యకు ఈ అవార్డుకు ఎన్నికచేశారు.

 

ఆయన 50 ఏళ్ల ప్రస్థానంలో తెలుగు ఇండస్ట్రీలో  ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. 14 ఏళ్ల వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఇప్పటికీ ఇండస్ట్రలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. మొదట తన తండ్రి నందమూరి తారక రామారావు నటవారసుడిగా చైల్డ్ ఆర్టిస్టుగా వెండితెర ఆరంగేట్రం చేశారు. 1974లో వచ్చిన తాతమ్మ కల సినిమాలో బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన  వరుసగా సినిమాలు చేస్తూ మొత్తం 109 సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన తన 110వ చిత్రంగా అఖండ 2 తెరకెక్కుతోంది.

 

పద్మ భూషణ్ అజిత్

అలాగే హీరో అజిత్ కూడా ఈ అవార్డును అందుకున్నారు. అలాగే సీనియర్ నటి శోభన కూడా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు.
గణతంత్ర్య దినొత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదిగానూ మొత్తం 139 మందికి ఈ అవార్డులను ప్రదానం చేయగా.. అందులో 7 మంది పద్మ విభూషణ్‌, 19మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.

Exit mobile version
Skip to toolbar