Balakrishna Forgot TG Deputy CM Name on Gaddar Awards Event 2025: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఇటీవల ఈ అవార్డుల ప్రకటించగా.. శనివారం ఈ అవార్డు ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. జూన్ 14న హైటెక్స్‌లో జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రదానోత్సవానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టివిక్రమార్కలు హాజరయ్యారు. అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా బాలయ్య స్టేజ్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా బాలయ్య స్టేజ్‌పై సీఎం, డిప్యూటీ సీఎంను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరు మర్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి పేరు ప్రస్తావించిన అనంతర ఆర్థిక, విద్యుత్‌శాఖ ఉపముఖ్యమంత్రి అంటూ ఆగిపోయారు. ఆయన పేరు గుర్తు చేసుకునేందుకు బాలయ్య చాలా కష్టపడ్డారు.
ఇక దానిని కవర్ చేసుకునేందుకు ఆయన నానా ఇబ్బందులు పడ్డారు. డిప్యూటీ సీఎం అంటూ పేరు గుర్తు రాక చాలా సేపు నీళ్లు నమిలారు. దీంతో అక్కడ ఉన్నారు పేరు అందించడంతో భట్టి పేరును స్పష్టంగా పలికి ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక మీమర్స్ అయితే తమదైన స్టైల్లో బాలయ్యను ట్రోల్ చేస్తున్నారు. కాగా గతంలో పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు మరిచిపోవడంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నెటిజన్స్ చర్చికుంటున్నారు.
భట్టి విక్రమార్క పేరు మర్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/OMKPh0GUeo
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025