Daaku Maharaaj Now Streaming on This OTT: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలయ్య మాస్ యాక్షన్, తమన్ బీజీఎం మరింత ప్లస్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్‌లో డాకు మహారాజ్ రన్ అవుతుంది. ఇక సినిమా థియేటర్లోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా డిజిటిల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సినిమాను ఓటీటీ రిలీజ్‌పై ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఫిబ్రవరి 21నుంచి మూవీ స్ట్రీమింగ్ ఇస్తున్నట్టు ప్రకటించింది.
చెప్పినట్టుగానే నిన్న అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్సలో డాకు మహారాజ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో కేవలం తెలుగులో రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణం నాలుగు వారాలకు రావాల్సిన ఈ సినిమా, ఆరు వారాలకు ఓటీటీకి రావడంతో అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల స్పెషల్ సాంగ్‌తో పాటు పలు కీలక సన్నివేశాల్లో మెరిసింది. అయితే ఓటీటీ వెర్షన్‌లో ఆమె సీన్స్ డిలీట్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలింది.