Site icon Prime9

Daaku Maharaaj OTT: బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ ఓటీటీ డేట్‌ ఫిక్స్ – ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌, ఎక్కడంటే!

Daaku Maharaaj OTT Release: నందమూరి బాలకృష్ణ లేటెస్ట్‌ మూవీ ‘డాకు మహారాజ్‌’ మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్‌ చేసి బాలయ్య కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్‌ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. బాబీ డైరెక్షన్‌, బాలయ్య మాస్‌ యాక్షన్, తమన్‌ బీజీఎం సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకువెళ్లింది.

బాక్సాఫీసు వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైల్డ్‌ యాక్షన్‌తో థియేటర్లో దుమ్మురేపిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం భారీగా చెల్లించినట్టు తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా రైట్స్‌ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందం ప్రకారం ‘డాకు మాహారాజ్‌’ను స్ట్రీమింగ్‌కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

ఫిబ్రవరి 21న సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో రూపొందిని ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ సాంగ్‌తో పాటు పలు సన్నివేశాల్లో నటించి ఆకట్టుకుంటుంది. బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషించారు.

Exit mobile version
Skip to toolbar