Site icon Prime9

Custody Movie : గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందంటున్న నాగ చైతన్య.. ఆసక్తిగా “కస్టడీ” టీజర్

naga chaitanya custody movie teaser relased

naga chaitanya custody movie teaser relased

Custody Movie : అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’.  వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ‘బంగార్రాజు’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం.  విలన్ పాత్రలో అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. సంపత్ రాజ్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది.

కుదిరినప్పుడు మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు చైతూ. ఈ క్రమంలోనే దడ, దోచేయ్, సవ్యసాచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమాలు నాగచైతన్యకి మాస్ ఇమేజ్ ని తెచ్చి పెట్టలేకపోయాయి. ఇప్పుడు మరోసారి మాస్ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోడానికి కస్టడీ సినిమాతో వస్తున్నాడు. ఇక ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమం లోనే ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఒక హింట్ ఇచ్చేసాడు దర్శకుడు. 90’s బ్యాక్‌డ్రాప్ తో ఈ సినిమా కథ ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక నాగచైతన్య ఇప్పటివరకు చేయని మాస్ యాక్షన్స్ తో ఇరగొట్టేశాడు అని టీజర్ లో కనిపిస్తుంది.

YouTube video player

డైలాగ్స్ తో అదరగొట్టిన చైతూ (Custody Movie)..

కాగా తాజాగా వచ్చిన టీజర్ లో ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో, ఎప్పుడోస్తుంది, ఎలా వస్తుందో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్‌ దట్‌ ట్రూత్‌ ఇన్‌ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య డైలాగ్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. టీజర్‌తోనే సినిమాపై ఓ రేంజిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ముఖ్యంగా ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజాల బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. ‘థ్యాంక్యూ’ ఫలితంతో నిరాశలో ఉన్న చైతూకి ఈ సినిమా ఊరటనిస్తుందని అక్కినేని అభిమానులంతా భావిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar