Site icon Prime9

Naga Chaitanya – Shobhitha : ఆ హీరోయిన్ తో ఈసారి అడ్డంగా దొరికిపోయిన అక్కినేని నాగ చైతన్య.. వైరల్ గా ఫోటో

naga chaitanya and shobhitha photo goes viral on social media

naga chaitanya and shobhitha photo goes viral on social media

Naga Chaitanya – Shobhitha : ఏ మాయ చేశావే సినిమాతో మొదలైన అక్కినేని నాగ చైతన్య – సమంత ప్రయాణం.. ఆ తర్వాత స్నేహంగా మారి.. చివరికి ప్రేమ అంటూ పెద్దల అంగీకారంతో మూడు ముళ్ళ బంధం లోకి అడుగుపెట్టారు. మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉండే ఈ జంట పెళ్లి తర్వాత కూడా కలిసి నటించారు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా వారు విడిపోయి దాదాపు రెండేళ్ళు కావస్తోంది. ప్రస్తుతం సామ్ – చై ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. అటు సమంత కేరీర్ లో ఫుల్ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇటు చైతూ కూడా సినిమాపై ఫోకస్ పెట్టి బిజీగా మారారు.

అయితే సమంతతో విడిపోయిన కొద్ది నెలలకే అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇటీవల అయితే సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు కోడై కూస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు గూఢచారి ఫేమ్ శోభితా ధూళిపాళ్ళ. చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నాడని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరు కెమెరాల కంటికి కూడా చిక్కారు. నాగచైతన్య బిజీ షెడ్యూల్‌ మెయింటైన్‌ చేస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా ఈ భామతో బయట కనిపిస్తూ ఉండడంతో వీరి డేటింగ్ వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కానీ వీటిపై చైతూ కానీ.. శోభిత కానీ ఇంత వరకు స్పందించలేదు.

తాజాగా వీరిద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్టు ఓ ఫొటో ద్వారా వెల్లడైంది. వీరిద్దరూ ఒకే రెస్టారెంట్ లో ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో.. చైతూతో చెఫ్‌ సురేందర్ మోహన్ ఫొటో దిగాడు. ఆ వెనకాల శోభితా ధూళిపాళ కూడా ఉన్నారు. ఆమె తన మొఖం కనిపించకుండా.. చేయి అడ్డు పెట్టుకొని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. మరి చైతూ, శోభితా డేటింగ్ వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.

గతేడాది నవంబర్ లోనూ శోభితా నాగచైతన్య లండన్ వేకేషన్ కు వెళ్లినట్టు ఓ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది. అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత నాగ చైతన్య కొత్త ఇంట్లోనూ శోభితా ధూళిపాళ కనిపించడం మీరి డేటింగ్ రూమర్లను వాస్తవం అనేలా చేశాయి. కనీసం ఈ రూమర్లను ఖండించకపోవడంతో సీక్రెట్ గా రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం చైతూ ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు.

Exit mobile version