Site icon Prime9

Naatu Naatu Song: ‘నాటు-నాటు’ కు స్టెప్పులేసిన BTS సింగర్

Naatu Naatu song

Naatu Naatu song

Naatu Naatu Song: ఎస్‌ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’సాంగ్‌కు విదేశీయులు కూడా మెస్మరైజ్ అయ్యారు.

నాటు నాటుకు సరదా స్టెప్పులు(Naatu Naatu Song)

ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్‌ ఉండటం విశేషం.

తాజాగా ఈ జాబితాలోకి సౌత్ కొరియా సన్సేషనల్ మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘BTS’ సింగర్‌ జంగ్ కూక్ (Jungkook) వచ్చి చేరారు.

ఈ మధ్య జంగ్ కూక్ తన అభిమానులతో లైవ్‌ నిర్వహించాడు. ఈ లైవ్ లో అతను ‘నాటు నాటు’ పాటను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు.

సీటులో కూర్చొనే నాటు నాటుకు సరదా స్టెప్పులు వేశారు.

 

 

 

మా ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం

ఇపుడు దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై RRR చిత్ర బృందం కూడా రియాక్ట్ అయింది.

‘జంగ్‌ కూక్‌.. ఈ పాటను నువ్వు ఇంతలా ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది. మీకు, బీటీఎస్‌ బృందం, దక్షిణ కొరియా మొత్తానికి మా ప్రేమాభిమానాన్ని పంపిస్తున్నాం’ అని పోస్ట్ చేసింది.

మరోవైపు నాటు- నాటు పాట ‘ఆస్కార్‌’ కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే.

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో దీనికి అకాడమీ అవార్డు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా ఈ సినిమాకు మరో గౌరవం దక్కింది.

 

 

మార్చి 12న అస్కార్ వేదిక

నాటు నాటు పాటను అస్కార్(Oscars) వేదికపై లైవ్ లో ప్రదర్శించే అవకాశం దక్కింది. సినిమాలో ఒరిజనల్ ట్రాక్ పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఈ లైవ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ విషయాన్ని అస్కార్ అకాడమీ బృందం అధికారికంగా తెలిపింది. మార్చి 12న ఈ పురస్కార వేడుక జరుగనుంది.

నాటు నాటు పాటకు సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందించగా.. చంద్రబోస్ రాశారు.

Exit mobile version