Allu Arjun Pushpa 3 Release Update: ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ సీక్వెన్స్‌తో సంచలనం సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప అంటే ఫవర్ కాదు ఫైర్.. కాదు కాదు వైల్డ్ అని నిరూపించాడు. 2021లో పుష్ప: ది రైజ్ విడుదలైన బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప: ది రూల్ వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బాక్సాఫీసు వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించింది తెలిసిందే. విడుదలైనప్పుటి రికార్డుల మీది రికార్డు బ్రేక్ చేస్తూ బాక్సాఫీసు లెక్కలు మార్చేశాడు.
బాక్సీఫీసు రికార్డ్స్ బ్రేక్
ఇండియన్ బాక్సాఫీసు వైల్డ్ ఫైర్ అంటే ఏంటో చూపించింది. ఫైనల్‌గా ఇండియన్ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రం రికార్డుకు ఎక్కింది. పుష్ప 2 ప్రమోషన్స్‌తోనే దీనికి మరో పార్ట్ కూడా ఉందని స్పష్టం చేసింది మూవీ టీం. కానీ, మూవీ ఎప్పుడువస్తుందనేది మాత్రం చెప్పకుండ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో పుష్ప 3 ఎప్పుడు వస్తుందా? అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ నిర్మాత రవిశంకర్ ఈ సస్పెన్స్‌కి తెర దించాడు. తాజాగా నితిన్ రాబిహుడ్ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలో ఒకరైన రవిశంకర్ పుష్ప 3పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
‘పుష్ప 3’ వచ్చేది అప్పుడే
ఈ సినిమా రావడానికి మరో మూడేళ్లు పడుతుందని, 2028లో తీసుకువస్తామని తెలిపాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడనేది కూడా అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం బన్నీ విదేశాల్లో ఉన్నాడని, తన ఫారిన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుని మేకోవర్ అవుతున్నాడన్నారు. అంతేకాదు అతడి నెక్ట్స్ మూవీ తమిళ డైరెక్టర్ అట్లీతోనే అని, ప్రస్తుతం ఈ సినిమా కోసం సన్నద్దమవుతున్నాడని ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాత రవి శంకర్ కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన కామెంట్స్‌తో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో యాంకర్ అనసూయ, సునీల్, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, రావు రమేష్, విలక్షణ నటుడు జగపతి బాబు, డాలి ధనుంజయ్, జగదీశ్ ప్రతాప్ వంటి తదితర నటులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తొలి పార్ట్‌లో సమంత, సెకండ్ పార్ట్‌లో శ్రీలీలు స్పెషల్ సాంగ్‌లో మెరిసారు.