Site icon Prime9

Hansika: హన్సిక వల్ల నా కాపురంలో కలతలు – పోలీసులకు నటి ఫిర్యాదు

Police Complaint on Actress Hansika: హీరోయిన్‌ హన్సిక తనని వేధిస్తుందని, ఆమె వల్ల తన వైవాహిక జీవితంలో కలతలు వస్తున్నాయంటూ బుల్లితెర నటి ముస్కాన్‌ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు తన భర్త ప్రశాంత్‌ మోత్వానీ, అత్త జ్యోతీ, ఆడపడుచు హన్సిక మోత్వానీల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. వారంత తనని మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది.

హన్సిక పెట్టే టార్చర్‌ వల్ల మానసిక ఒత్తడికి గురయ్యానని చెప్పారు. దాని వల్ల తన ముఖం సగ భాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు. డిసెంబర్‌ 18న ముంబై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ముస్కాన్‌ నాన్సీ.. హన్సిక వదిన. ఆమె సోదరుడు ప్రశాంత్‌ భార్య. 2020లో వీరికి పెళ్లయ్యింది.

వివాహమైన కొద్ది రోజులకే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని ఆడపడుచు జ్యోతి, అత్త తనని వేధించినట్టు నటి ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమవుతుందని ఫిర్యాదులో పేర్కొంది. తరచూ మాటలతో వేదిస్తూ తనని మానసికంగా కృంగదీశారని, ఆ ఒత్తిడి కారణంగా తన ముఖం సగ భాగం పాక్షిక పక్షవాతానికి గురైందని ఆమె ఫిర్యాదులో తెలిపింది.

Exit mobile version