Thaman Emotional Comments on Regrets: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఎస్ఎస్ తమన్ ఒకరు. పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. తమన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంది. ముఖ్యంగా బాలయ్య సినిమాకు తమన్ స్కోర్ మరింత హైప్ పెంచుతోంది. ఈ కాంబినేషన్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం తమన్ అఖండ 2, హరిహర వీరమల్లు వంటి చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు.
అలాగే ఆహాలో వచ్చే ఇండియన్ ఐడల్ షోకి జడ్జీగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాను జీవితంలో కొందరి నమ్మి మోసపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్‌లో ఓ ఇంటర్య్వూలో తన కెరీర్ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని, కొందరిని నమ్మి మోసపోయిన చేదు అనుభవాలు కూడా ఉన్నాయన్నాడు. “జీవితంలో ప్రతి ఒక్కరు ఏదోక సమయంలో కొందరు వ్యక్తిలను నమ్మి మోసపోతారు. నాకు కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. నేను ఎంతోమందిని నమ్మాను. ఎంతో డబ్బు పోగోట్టుకున్నాను. వారు నాకు వెన్నుపోటు పోడిచారు.
నా ముందు నా గురించి మంచిగా మాట్లాడేవారు. నా వెనకేలా నా గురించి చెత్తగా మాట్లాడేవారు. వాటి నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నా” అని చెప్పుకొచ్చాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిమర వీరమల్లు మూవీపై బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అభిమానుల కోసం హరిహర వీరమల్లు గురించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని యాంకర్ అడిగారు. దీనికి తమన్ స్పందిస్తూ.. ఇదోక న్యూక్లియర్ బాంబ్ అంటూ హైప్ పెంచాడు. పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో.. ఈ సినిమా అలా ఉంటుందన్నాడు. ఇదోక న్యూక్లియర్ బాంబ్ అని, తప్పుకుండ ఎంజాయ్ చేస్తారన్నాడు. ఇక ఆలస్యం అనేది లేకుండ మ్యూజిక్‌ని కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు తమన్.