Murali Mohan Comments on Grand Daughter Wedding: సీనియర్ నటుడు మొరళీ మోహన్ మనవరాలు, ఎమ్‌ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు పెద్ద అంగీకారంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లితో మొరళీ మోహన్ కుటుంబం కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు బంధువులు అయ్యారు. తాజాగా మనవరాలి పెళ్లిపై మొరళీ మోహన్ స్పందించారు. కీరవాణితో సంబంధం కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా తన మనవరాలి ఎంపిక తనకు బాగా నచ్చిందన్నారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆయన మనవరాలు రాగ పెళ్లిపై స్పందించారు. “రాజమౌళి కోడలు పూజ, నా మనవరాలు రాగ మంచి స్నేహితులు. దీంతో ఇద్దరు ఒకరింటికి ఒకరు వెళ్లూ వస్తుండేవారు. అలా నా మనవరాలు రాగ తరచూ రాజమౌళి ఇంటికి వెళ్లేది. ఆ సమయంలో రాజమౌళి, కీరవాణి కుటుంబాలు ఎంత బాగా కలిసి ఉన్నాయో స్వయంగా చూసింది. కుటుంబ సభ్యులంతా ఫ్రెండ్స్‌లా కలిసి ఉండేవారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదగా ఉండేవారు. వీకెండ్ వస్తే రెండు కుటుంబాలు కలిసి ఫాంహౌజ్‌కి వెళ్లి ఆటలు ఆడుతూ సరదాగా గడిపేవారు.
దీంతో ఆ ఫ్యామిలీ నా మనవరాలు రాగ బాగా నచ్చింది. మొదటి నుంచి ఉమ్మడి కుటుంబం అంటే తనకు ఇష్టం. వారంత కలిసి మెలిసి ఉండటం చూసి ముచ్చటపడింది. దీంతో ఆ కుటుంబం నచ్చడంతో తనే శ్రీ సింహాకు ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని మొదట మాకు చెప్పలేదు. ఇక తనకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. నీకు మనసుకు నచ్చినవాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగి. అప్పుడే రాగ తను కీరవాణి కుమారుడు శ్రీ సింహాను ఇష్టపడ్డానంది. మీరు ఒకప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. ఇక తన నిర్ణయం మాకు కూడా నచ్చి పెళ్లి ఒకే చెప్పాం. పెళ్లిలో కూడా వారంత కలిసిపోయి ఉన్నారు.
పెళ్లి కూతురిని వధువు తరపు వారు పల్లకిలో మోసి మండపానికి తీసుకురావాలి. కానీ అప్పుడు కీరవాణి పెద్ద కుమారుడు, గాయకుడు కాలభైరవ కూడా పల్లకి మోశాడు. వారి వధుపు తరపు వారిమన్న గర్వం ఎక్కడ కనిపించలేదు. అన్నింటిలో కలిసిపోయారు. వారి అలా చూసి నాకు చాలా సంతోషం వేసింది” అంటూ మొరళి మోహన్ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా పెళ్లి కూతురు రాగా మొరళి మోహన్ కొడుకు కూతురు. ఇక శ్రీ సింహా కీరవాణి రెండో కుమారుడు అనే విషయం తెలిసిందే. యమదొంగలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన శ్రీ సింహా మత్తవదలరా సీక్వెల్స్‌తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో తన నటనతో ఆడియన్స్‌ని మెప్పించాడు.