Site icon Prime9

Mufasa OTT Release: ఆఫీషియల్‌.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న ముఫాసా – స్ట్రీమింగ్‌ ఎప్పడు, ఎక్కడంటే!

Mufasa Telugu OTT Release Date and Streaming Update: హాలీవుడ్‌ సంస్థ డిస్నీ చిత్రాలకు ప్రపంవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉంది. ఈ బ్యానర్‌ నుంచి సినిమా వస్తుందంటే చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇదే ఈ బ్యానర్‌ వచ్చిన సూపర్‌ మేన్‌, అవతార్‌, లయన్‌ కింగ్, ఫ్రోజోన్‌ వంటి పలు చిత్రాలుకు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. అదే జాబితాలో తెరకెక్కి గతేడాది రిలీజైన చిత్రం ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. మ్యూజికల్‌ లైవ్‌ యాక్షన్‌ చిత్రంగా గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

మహేష్ బాబు డబ్బింగ్

ఇంగ్లీష్‌లో పాటు భారతీయ భాషల్లోనూ ఒకేసారి నిర్మితమైంది. ఇక ఈ చిత్రంలోని లీడ్‌ రోల్‌ ముఫాసాకు తెలుగులో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ సినిమా మరింత క్రేజ్‌ వచ్చింది. హిందీలో షారుక్‌ ఖాన్‌, తమిళంలో దళపతి విజయ్‌లు ముఫాసాలకు డబ్బింగ్‌ చెప్పడంతో ఈ సినిమా చూసేందుకు ఆయా భాష ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ 20 ముఫాసా: ది లయన్‌ కింగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు మూడు నెలలు కావోస్తోంది. ఇంతకాలానికి ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. ఇప్పటికే ముఫాసా మూవీ ఓటీటీలోకి వచ్చినా.. అది రెంటల్‌ పద్దతిలో స్ట్రీమింగ్‌ అవుతుంది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ సినిమా రెంటల్‌ పద్దతిలో అందుబాటులోకి వచ్చింది.

ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్

అయితే ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీ జీయో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఈ మేరకు సదరు సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 26 నుంచి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ ఇస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఈ మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్‌లో రెంటల్‌ విధానంలో అందుబాటులోకి వచ్చింది. దీంతో మూవీ లవర్స్‌ అంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ క్రమంలో జీయో హాట్‌స్టార్‌ ఫ్రీగా స్ట్రీమింగ్‌ ఇస్తుండటంతో యానిమేటేడ్‌ మూవీ లవర్స అంతా పండగ చేసుకుంటున్నారు. 2019లో విడుదలైన ‘ది లయన్‌ కింగ్‌’కు ఇది ప్రీక్వెల్‌గా తీసుకువచ్చారు. అనాథ అయిన సింహం అడవికి రాజు ఎలా అయ్యిందనే ఈ సినిమా కథ.

Exit mobile version
Skip to toolbar