Site icon Prime9

Mohan Lal-Mammootty: మమ్ముట్టి కోసం శబరిమలలో పూజా – వివాదం స్పందించిన మోహన్‌ లాల్‌

Mohan Lal Reacts on Sabarimala Controversy: ఇటీవల శబరిమలలో మలయాళ స్టార్‌ హీరో మోహల్‌ లాల్‌ చేసిన పని వివాదంగా మారిన సంగతి తెలిసిందే. మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టి కోసం ఆయన శబరిమలలో పూజ చేయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై హిందు సంఘాలు పెద్ద ఎత్తున చర్చకు తేరలేపాయి. అయితే తాజాగా ‘ఎల్ 2: ఎంపురన్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయనకు దీనిపై ప్రశ్న ఎదురైంది. మరి దీనికి మోహల్‌ లాల్‌ ఎలా స్పందించారు? ఏమన్నారో ఇక్కడ చూడండి!.

చెన్నైలో లూసిఫర్ 2 ప్రమోషన్స్

గతంలో మోహల్‌ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘లుసిఫర్‌’ మూవీకి సీక్వెల్‌గా ఎల్‌ 2: ఎంపురన్‌ రూపొందింది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్‌ గత కొన్ని రోజులు ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన చెన్నై ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌ లాల్‌కు శమరిమల వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ అందులో తప్పేముంది అంటూ సమాధానం ఇచ్చారు.

మమ్ముట్టి నా సోదరుడు

“మమ్ముట్టి నా స్నేహితుడు మాత్రమే కాదు నాకు సోదరుడితో సమానం. అందుకే ఆయన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాను. అయినా నా స్నేహితుడి కోసం నేను పూజా చేయిస్తే తప్పేముంది. ఫ్రెండ్‌ కోసం పూజా చేయించడం నా వ్యక్తిగత విషయం” అని ఈ వివాదానికి చెక్‌ పెట్టే ప్రయత్నం చేశారు. ముస్లిం వ్యక్తి అయిన మమ్ముట్టికి శబరిమలలో పూజలు చేయిండం ఏంటని హిందు సంఘాలు మండిపడ్డాయి. దీనిపై అభ్యంతరాలు రావడంతో ఈ అంశం వివాదంగా మారింది.

ఆ పుకార్లకు చెక్

అనంతరం మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న పూకార్లపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అతని ఉన్నవి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మాత్రమే అన్నారు. అందరికి ఇలాంటివి సాధారణమే. భయపడాల్సినంతగా ఏం లేదనన్నారు. కాగా ప్రస్తుతం రంజాన్‌ సీజన్‌ కావడంతో మమ్ముట్టి సెలవుల్లో ఉన్నట్టు ఇటీవల ఆయన టీం తెలిపిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా మమ్మట్టి క్యాన్సర్‌ బారిన పడ్డారని, ప్రస్తుతం దీనికి ఆయన చికిత్స తీసుకుంటున్నారంటూ మలయాళ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

అంతేకాదు ఇటీవల ఆయన క్యాన్సర్‌ చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్లాచ్చారని, ఈ వ్యాధి వల్లే ఆయన సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు ఖండించిన ఆయన టీం ప్రస్తుతం రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నారని, అందువుల్లో షూటింగ్‌లకు విరామం ప్రకటించారని తెలిపింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మోహల్‌లాల్‌ శబరిమల వెళ్లి కాలి నడకన కొండ ఎక్కారు. అనంతరం తన స్నేహితుడు మమ్ముట్టి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించడంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టుయ్యింది.

Exit mobile version
Skip to toolbar