Mohan Babu: ఇప్పుడంటే కలక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా వస్తుంది అంటే ట్రోలింగ్ అవుతుంది కానీ, ఒకప్పుడు ఆయన సినిమాలు వేరు.. ఆయన స్థాయి వేరు. ఒక విలన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారి.. సొంతంగా బ్యానర్ ను స్థాపించి మంచి మంచి సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చిన నటుడుగా మోహన్ బాబుకు ఒక గుర్తింపు ఉంది.
ఇక సొంత కొడుకులు వలనే మోహన్ బాబు రోడ్డున పడ్డాడు. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సాధారణంగా మోహన్ బాబు చాలా రేర్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మొదటిసారి తన మనోగతాన్ని బయటపెట్టాడు. తన బాల్యం, యవ్వనం, ఇండస్ట్రీ, పిల్లలు.. ఇలా చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడాడు.
” 1975 లో స్వర్గం- నరకం అనే సినిమాతో నేను ఎంట్రీ ఇచ్చాను. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది దాసరి నారాయణరావు గారు. మొట్ట మొదటిసరి నేను చూసిన సినిమా రాజమకుటం. అప్పట్లో నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఆ సినిమా చూసాను. నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు నేను 560 సినిమాలకు పైగా నటించాను. ఇంకా నటిస్తూనే ఉంటాను.
ప్రతిజ్ఞ అనే సినిమాతో నేను నిర్మాతగా మారాను. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను సీనియర్ ఎన్టీఆరే ప్రారంభించారు. చందబ్రాబు క్లాప్ కొట్టారు. ఆ బ్యానర్ లోనే నేను మేజర్ చంద్రకాంత్ సినిమా తీసాను. ఆ సినిమా కోసం నా ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాను. చాలామంది వద్దన్నారు. చివరకు అన్నగారు కూడా వద్దు అని వారించారు. కానీ, నేను వినలేదు. మొండిగా ఆ సినిమా తీశాను.. సక్సెస్ అయ్యాను.
దేవుడి దయవలన నా జీవితంలో నేను కోరుకున్నవి అన్ని జరిగాయి. నేను దాదాపు 560 సినిమాల్లో నటించాను. ఇప్పుడు నా పిల్లలు నటిస్తున్నారు. సినిమాలు ఫెయిల్ అవ్వడం వేరు.. నటుడుగా ఫెయిల్ అవ్వడం వేరు. నేనెప్పుడూ ఓడిపోలేదు.ఇప్పటికీ నాకు మంచి మంచి పాత్రల్లో నటిస్తూ.. నా పిల్లలతో హాయిగా గడపాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేనెవరిని మోసం చేయలేదు. చాలామంది నన్నే మోసం చేశారు. నాకు ఆవేశం ఎక్కువ. అది కూడా ఇలా మోసం చేసినవారి వలనే వచ్చింది. ఆ ఆవేశం నాకే నష్టం కలిగించింది.
సోషల్ మీడియాలో మా కుటుంబంపై ట్రోల్స్ వస్తూ ఉంటాయి. వాటిని నేను పట్టించుకోను. ఎవరికి అపకారం చేయాలనీ నేను చూడను. ఎదుటివారి నాశనం ఎప్పుడు కోరుకొను. అలాకోరుకుంటే .. వారికంటే ముందు మనం నాశనం అవుతాం. అందరూ బావుండాలి. అందులో మనముండాలి. ఒకరిపై ట్రోలింగ్ చేస్తే వారికి వచ్చే ఆనందంఏంటి అనేది నాకు తెలియదు. ఈ విషయంలో నేను ఎవరిపై నిందలు వేయలేను. ఆ దేవుడి దయతో కన్నప్ప సినిమాలో ఒక ఛాన్స్ వచ్చింది. ఆ దేవుడి ఆశీస్సులతోనే కన్నప్ప పూర్తీ అయ్యింది. రిలీజ్ తరువాత ప్రేక్షకులే ఎలా ఉందో చెప్తారు. అది వారికే వదిలేశాను” అని చెప్పుకొచ్చాడు.