Chiranjeevi: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్నిరోజులే అవకాశాలు ఉంటాయి. అది హీరోయిన్లకు మాత్రమే కాదు. హీరోలకు కూడా వర్తిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. ఆయన వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయస్సువారు ఎలా ఉంటారో అందరికీ తెల్సిందే. కానీ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోలకు మాత్రం వయస్సు వెనక్కి వెళ్తుందా.. ? అనిపిస్తూ ఉంటుంది.
చిరంజీవి మాత్రం కాదు.. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది ఉన్నారు. 50,60 ల్లో ఉన్నా కూడా 20, 30ల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ టాలీవుడ్ టాప్ హీరోస్ అందరూ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ముఖ్యంగా చిరంజీవి.. కుర్ర హీరోలకు పోటీగా సినిమాలతోనే కాదు. అందంలోనూ పోటీపడుతున్నారు.
తాజాగా చిరు నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఫోటో చూసినవారెవ్వరు అయినా.. ఆయనకు వయస్సు అవ్వలేదనే చెప్తారు. అంత స్టైలిష్ గా వింటేజ్ లుక్ లో కనిపించారు. బ్లాక్ గాగుల్స్, గ్రీన్ కలర్ షర్ట్.. ముఖంలో ఆ ఛార్మ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ లుక్ ను చూసిన అభిమానులు.. బాసూ.. నీ గ్రేస్ అని కొందరు.. అమృతం ఏమైనా తాగావా బాసూ.. వయస్సు వెనక్కి వెళ్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
విశ్వంభర.. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ, చరణ్ గేమ్ ఛేంజర్ కోసం త్యాగం చేశాడని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం సమ్మర్ లో చిరు వేటకు సిద్ధమవుతున్నాడని సమాచారం.
బింబిసార లాంటి భారీ హిట్ తరువాత వశిష్ఠ చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు. ఈ సినిమా కూడా అలాంటి స్టైల్లోనే ఉంటుందని అంటున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కథలాంటిదే అని టాక్ నడుస్తున్నా.. అలాంటిదేమి కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.