Site icon Prime9

Bhola Shankar : భోళా శంకర్ నుంచి మళ్ళీ లీక్ ఇచ్చిన మెగాస్టార్.. ఈసారి సంగీత్ పార్టీ సాంగ్ !

megastar chiranjeevi post on bhola shankar song shoot as chiru leaks goes viral

megastar chiranjeevi post on bhola shankar song shoot as chiru leaks goes viral

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. త్వరలోనే “భోళా శంకర్” గా అలరించేందుకు సిద్దమవుతున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. గతంలో ఫ్లాప్ లతో ఢీలా పడ్డ మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తూ ఈసారి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.  యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.

ఇటీవలే స్విట్జర్లాండ్‌లో ఒక సాంగ్ ని షూట్ ని పూర్తి చేసుకొని వచ్చారు. ఆ సాంగ్ షూట్ సమయంలో చిరు లీక్స్ అంటూ అక్కడి నుంచి కొన్ని ఫోటోలు లీక్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. చిరు లీక్స్ మరికొన్ని కూడా ఉన్నాయి అంటూ అప్పుడే చెప్పుకొచ్చాడు. తాజాగా మరో లీక్ ఫ్యాన్స్ కోసం చేశాడు. (Bhola Shankar) సినిమాలో ఓ సంగీత్ పార్టీ సాంగ్ ఉందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సాంగ్ షూట్ జరుగుతుంది. ఇక సెట్ నుంచి సంగీత్ సాంగ్ కోసం కలర్ ఫుల్ గా గ్రాండ్ సెట్ ఏర్పాటు చేశారు. షూటింగ్ కి ఆర్టిస్టులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇక చిరు కీర్తి, తమన్నా లతో ముచ్చట్లు పెట్టుకుని తెగ అల్లరి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇక మరోవైపు చిరు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అంతకుముందు లీక్ చేసిన ఫొటోల్లో సాంగ్ ఘాట్ కోసం ఏర్పాట్లు చేస్తుండగా.. చిరంజీవి చైర్ లో కూర్చొని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే చిరు తన లీక్స్ తో భోళా మానియాని ఫుల్ ట్రెండింగ్ లో ఉంచుతున్నారు.

Exit mobile version