Megastar Birthday: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు( ఆగష్టు 22) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ తదుపరి చిత్రం మెగా156 అధికారికంగా ప్రకటించబడింది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం గాడ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనుంది.
నిర్మాతగా సుస్మిత.. (Megastar Birthday)
తన కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 నుండి తన తండ్రి చిరంజీవి కాస్ట్యూమ్స్ ను చూసుకుంటున్న సుస్మిత కొణిదెల అతనితో సినిమా నిర్మించే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరించనుంది.బ్యానర్ నుండి ప్రకటన ఇలా ఉంది.. 4 దశాబ్దాలుగా వెండితెరను పాలించిన రాజసం! భావోద్వేగాల పెంపుదలని రేకెత్తించే వ్యక్తిత్వం! తెరపైనా, వెలుపలా విలువ ఇచ్చే వ్యక్తి. 155 చిత్రాల తర్వాత, ఇప్పుడు #MEGA156 మెగారాకింగ్ ఎంటర్టైనర్ అవుతుంది. @KChiruTweets గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిని ఇంకా ప్రకటించలేదు.
బింబిసార దర్శకుడితో..
మరోవైపు మెగా 157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించనున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా మెగా 157కి దర్శకత్వం వహించే దర్శకుడిని ప్రకటించారు.బింబిసారతో అరంగేట్రం చేసిన వశిష్ట మెగా157కి మెగాఫోన్ పట్టనున్నారు. అతని మొదటి సినిమా బింబిసార తరహాలోనే మెగా157 కూడా ఫాంటసీ మూవీగా ఉంటుందని పోస్టర్ ద్వారా తెలుస్తోంది. చిరంజీవికి అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రీ-కాన్సెప్ట్ పోస్టర్‌లో చీకటి గుహలో తేలు కనిపించగా, కాన్సెప్ట్ పోస్టర్‌లో నక్షత్రం ఆకారంలో ఉన్న వస్తువులో ఐదు అంశాలు ఉన్నాయి.