Site icon Prime9

AM. Ratnam: మేకప్ మెన్ నుంచి మెగా ప్రొడ్యూసర్ గా ఎదిగిన ఏఎం రత్నం లైఫ్ స్టోరీ

Ratnam

Ratnam

AM. Ratnam: ఎ.ఎం. రత్నం.. టాలీవుడ్ , కోలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.

ఆయన చిత్రాల్లో భారీ సెట్టింగులు. తారా గణం ఉంటాయి.

క్వాలిటీ అవుట్ పుట్ కు ఎంత ఖర్చు పెట్టడానికయినా వెనుకాడని

నిర్మాతగా ఎ.ఎం. రత్నానికి సౌత్ ఇండియాలో మంచి పేరు ఉంది.

సినిమారంగంలో మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రవేశించి నిర్మాతగా

మారిన రత్నానికి చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ పై చక్కని అవగాహన ఉంది.

అందుకే పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఆయన మూడు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో నిర్మాతగా కొనసాగుతున్నారు.

ఆరణి మునిరత్నం గా పిలవబడే ఎ.ఎం. రత్నం 1954 ఫిభ్రవరి 4న

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు. బాల్యంనుంచి సినిమాలంటే ఆసక్తి ఉండటంతో

మేకప్ మెన్ గా సినీరంగ ప్రవేశం చేసారు. ప్రముఖ హీరోయిన్ విజయశాంతికి పర్సనల్ మేకప్ మెన్ గా చేసిన రత్నం

ఆమెను హీరోయిన్ గా పెట్టి కర్తవ్యం చిత్రం నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు.

ఈ చిత్రానికి గాను విజయశాంతి జాతీయ ఉత్తమనటి అవార్డును పొందారు.

 

మేకప్ మెన్ నుంచి నిర్మాతగా మారి.. (A.M. Ratnam)

ఎ.ఎం. రత్నం మెగాఫోన్ కూడా పట్టి దర్శకుడిగా మారారు.

పెద్దరికం, సంకల్పం చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

తమిళంలో విజయం సాధించిన జెంటిల్ మెన్ ప్రేమికుడు, ఇండియన్ (తెలుగులో భారతీయుడు) చిత్రాలను

ఎ.ఎం. రత్నం  తెలుగులోకి అనువదించి ఆయన విజయాలు సాధించారు.

ఖుషి,నీ మనసు నాకు తెలుసు. నాగ, బంగారం, ఆక్సిజన్ చిత్రాలను రత్నం నిర్మించారు.

 

పవన్ అభిమానులను ఖుషి చేసి.. (A.M. Ratnam)

 

ఖుషి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి.

తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, సుస్వాగతం వంటి విజయాల తర్వాత ఈ మూవీతో

పవర్ స్టార్ తన స్దానాన్ని సుస్దిరం చేసుకున్నారు.

ఇటీవల సెకండ్ రిలీజ్ లో కూడా ఖుషి బాక్సాఫీసు వద్ద వసూళ్లజోరును కొనసాగించింది.

 

హరిహరవీరమల్లు చిత్రానికి నిర్మాతగా (A.M. Ratnam)

ఎ.ఎం. రత్నం పవన్ కళ్యాణ్ తో హరి హర వీర మల్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీనికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం 2023 చివరి భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

హరిహరవీరమల్లుసరైన పాన్-ఇండియన్ సినిమా అని, ఇది ఉత్తర భారత ప్రేక్షకులకు

మరింత నచ్చుతుందని రత్నంఅన్నారు.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయన్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో

పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయడానికి నిధి అగర్వాల్ ఎంపికైంది.

ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రంలో

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

కమల్ హాసన్ తో రత్నం నిర్మించిన ఇండియన్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో

అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ సిద్దమవుతోంది.

సినీ రంగంలోనే ఎ.ఎం. రత్నం వారసులు..

ఎ.ఎం.  రత్నం కుమారులు జ్యోతి కృష్ణ, రవికృష్ణలు కూడా సినీరంగంలోనే ఉన్నారు.

వీరిలో జ్యోతికృష్ణ నటుడు, దర్శకుడిగా, రవికృష్ణ నటుడిగా రాణిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version