Site icon Prime9

Manninchava : నవంబర్ 25న విడుదలవుతున్న ‘మన్నించవా’

Manninchava

Manninchava

Tollywood News: రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆనేగౌని రమేష్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో మంజుల చవన్ నిర్మించిన చిత్రం ‘మన్నించవా’. మల్హోత్రా ఎస్ శివమ్, శంకర్, అనుశ్రీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ బిగ్ సీడీని ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో శివ బాలాజీ, డైరెక్టర్ బాబ్జీ, నటులు ఖయ్యుమ్, జబర్ధస్త్ అప్పారావు, మానిక్ వంటి వారితో పాటు చిత్రయూనిట్ అంతా హాజరై.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరారు.

ఈ సందర్భంగా నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. జనగాం గ్రామానికి చెందిన మంజుల గారితో కలిసి రమేష్ గౌడ్‌గారు ఈ సినిమాను నిర్మించారు. ఇండస్ట్రీకి ఇది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను. దర్శకుడు రమేష్ గౌడ్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని భావిస్తున్నాను. అందరికీ ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు.

దర్శకుడు ఆనేగౌని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. విలేజ్ నేపథ్యంలో సాగే మంచి ప్రేమకథ, విలువలు ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోహీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. నిర్మాత మంజుల చవల‌గారు మంచి సపోర్ట్ అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

Exit mobile version
Skip to toolbar