Site icon Prime9

Suresh Kondeti: సురేష్ కొండేటి ‘అభిమాని’ సినిమాకి ‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ రీ – రికార్డింగ్

ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‍లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో “అభిమాని” సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ – అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది . ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్. అన్నారు.

అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ – అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటున్నా. మన ‘అభిమాని’ మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రీ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. మూవీలోని విజువల్స్ మణిశర్మ గారి నేపథ్య సంగీతం కలిసి ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాకి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలుకు మణిశర్మ గారు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ మూవీ లో సురేష్ కొండేటి గారు ప్రధాన పాత్రలో నటించారు. యముడిగా అజయ్ ఘోష్ గారు నటించారు, నానమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ గారు నటించారు, చిత్రగుప్తుని పాత్రలో ఎస్.కె రెహమాన్ గారు నటించారు. హీరోయిన్‌గా అక్సాఖాన్ ఆమెకు జతగా యువ కథాయకుడు జై క్రిష్ నటించారు. నా మీద ఎంతో నమ్మకంతో ప్రధాన పాత్ర చేయడానికి ఒప్పుకున్న సురేష్ కొండేటి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా మీద నమ్మకంతో సినిమాను ప్రొడ్యూస్ చేసిన ఎస్ కే రెహమాన్ గారికి, కందా సాంబశివరావు గారికి చాలా, చాలా థాంక్స్ . వచ్చే నెలలోనే మా అభిమాని సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ..  అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరికీ కొత్త వెలుగును ఇవ్వాలి. అలాగే నాకు ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశ‌ర్మ‌ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సంక్రాంతిని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈసారి మా ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్‌లో తన సినిమాలతో రఫ్పాడించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్ర, చూడాలనివుంది, బాలకృష్ణ గారి సమరసింహారెడ్డి, నరసింహానాయుడు వంటి సినిమాల్లో మణశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర హీరోలు అందరితో పాటు యంగ్ హీరోస్ కు మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు.

పవర్ స్టార్, డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి ఖుషీ సినిమాకు మణిశర్మ గారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన ఇప్పుడు నేను చేస్తున్న అభిమాని సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఆనందం కలిగిస్తోంది. తెలుగు సినిమాల ప్రస్తావన అందులో సంగీతం గురించి వచ్చినప్పుడు మనందరికీ మణిశర్మ గారు గుర్తుకు వస్తారు, నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఇప్పుడు అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం తో సంతోషంగా ఉంది. మణిశర్మ గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. మణిశర్మ గారి మా టీమ్ కు తోడయ్యక అభిమాని సినిమా లెవెల్ పెరిగింది. రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఈ విషయం లో మణిశర్మ గారి సపోర్ట్ మరువలేనిది.

మా అభిమాని సినిమా గ్లిమ్స్ విడుదల చేసినటువంటి దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారి ఆశీస్సులతో మణిశర్మ గారు ఇచ్చిన నేపథ్య సంగీతం తో ఈ సినిమా మంచి విజయాన్ని పొందుతుందని, నటుడిగా నేను మరో స్థాయికి చేరుకోవడానికి ఆ విజయం దోహదం చేస్తుందని భావిస్తున్నాను. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అభిమాని సినిమా పోస్టర్, సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వచ్చే నెలలో రిలీజ్ కానున్న “అభిమాని” సినిమా ఇదే రెస్పాన్స్ ఉంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి డిఓపి. : శేషు డి నాయుడు, ఎడిటర్ : శివ శర్వాణి.

Exit mobile version